5G Spectrum : 5జీ స్పెక్ట్రం వేలంలో గట్టి పోటీ ఇవ్వనున్న అదానీ నెట్వర్క్..

5G Spectrum : ఇండియాలో అతిపెద్ద స్పెక్ట్రమ్ వేలానికి తెర లేచింది. ఇండియన్ టాప్ టెలికం కంపెనీలు తమ అవసరానికి తగిన ఫ్రీక్వెన్సీ కోసం బిడ్లను దాఖలుచేశాయి. అసలు స్పెక్ట్రం అంటే ఏమిటి..? వేలంలో పాల్గొనున్న కంపెనీలు ఏవి..? 5జీ సర్వీస్‌కి అంత క్రేజ్ ఎందుకు..? 5జీ వస్తోంది సరే ఇప్పటికే ఉన్న 4జీ,3జీ సంగతేంటి..? ఇలాంటి అంశాలపై ఓ లుక్కేద్దాం.
దేశంలో నెక్ట్స్ జనరేషన్ టెలికం సర్వీస్ ప్రారంభించేందుకు 5జీస్పెక్ట్రమ్ వేలం మంగళవారం ప్రారంభమైంది. ఈ వేలంతో కేంద్ర ప్రభుత్వానికి దాదాపు 4.3లక్షల కోట్లు రావచ్చని అంచనా వేస్తున్నారు..రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్ వొడాఫోన్ ఐడియా,ఆదాని డేటా నెట్‌వర్క్స్ కంపెనీలు వేలంలో పాల్గొననున్నాయి. ఆగస్టు చివరి నాటికి 5జీ సేవలు దేశంలో ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. 5జీ సేవలు ముందుగా ఢిల్లీ,లక్నో,చండీగడ్, గురుగ్రామ్, అహ్మదాబాద్, కోల్‌కతా, హైదరాబాద్, ముంబై, పుణే నగరాల్లో ప్రారంభం కానున్నాయి.
ఇక 5జీ అంటే నెక్ట్స్ జనరేషన్ మొబైల్ నెట్‌వర్క్. కొత్త గ్లోబల్ వైర్‌లెస్ సిస్టం. మూడు బ్యాండ్‌లలో పనిచేసే నెట్‌వర్క్. దీంతో టెలికం సేవలు మరింత మెరుగవుతాయి. 5జీతో బిజినెస్ ప్యాట్రన్ కూడా మారే అవకాశం ఉంది. సమాచార విప్లవంతో పాటు పారిశ్రామిక రంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చే అవకాశం ఉందని టెలికం రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం చైనా, అమెరికా, సౌత్ కొరియా,బ్రిటన్,కెనడా అస్ట్రేలియా,ఇటలీ, సౌదీ అరేబియా,ఫ్రాన్స్,స్వీడన్ లాంటి దేశాల్లో అందుబాటులో ఉంది.అయితే మనదేశంలో కూడా 5జీ సర్వీసుల ట్రయల్‌ను భోపాల్,గుజరాత్‌లోని కాండ్ల పోర్ట్,బెంగుళూరు మెట్రో, ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో నిర్వహిస్తోంది ట్రాయ్.
మరోవైపు స్పెక్ట్రమ్ వేలంలో పాల్గోనేందుకు రిలయన్స్ అత్యధిక బిడ్‌ను వేసింది. అడ్వాన్స్ కింద దాదాపు పద్నాలుగువేల కోట్లు డిపాజిట్ చేసింది. భారతీ ఎయిర్‌టెల్ ఐదువేల ఐదువందల కోట్లు, వొడాఫోన్ ఐడియా రెండువేలరెండొదల కోట్లు, ఆదాని డేటా నెట్‌వర్క్స్ వంద కోట్లు డిపాజిట్ చేశాయి. అయితే ఆదాని గ్రూప్ పోర్ట్, విమానాశ్రయాలకు మాత్రమే 5జీ సేవలను ఉపయోగించుకుంటామని, డైరెక్ట్ మార్కెట్ లోకి వచ్చే ఉద్దేశం లేదని తెలిపింది. మరోవైపు రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్ నెట్‌వర్క్ లు మాత్రం స్పెక్ట్రంను సొంతం చేసుకునేందుకు రెడీగా ఉన్నాయి.
4జీ కంటే పది రెట్లు వేగంతో 5జీ ద్వారా డేటా ట్రాన్సఫర్ అవుతుంది.ప్రస్తుతం 600MHz,700MHz, 800MHz,900MHz,1800MHz, 2100MHz, 2300MHz, 3300MHz, 26GHz ఫ్రీక్వెన్సీ బ్యాండ్లలో వేలం జరుగుతుంది..స్పెక్ట్రమ్ సిగ్నల్ పూర్తిగా అమ్ముడు పోయేవరకు వేలం నిర్వహించనున్నారు. కొన్ని రోజుల పాటు సాగే వేలంలో ప్రముఖ కంపెనీలు పాల్గొంటున్నాయి.
సాంకేతిక విప్లవంతో రోజురోజుకు అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయి.. మొదట్లో 1970లో జపాన్‌లో మొదటితరం మొబైల్ నెట్‌వర్క్ అందుబాటులోకి వచ్చింది. అయితే అది కేవలం ఫోన్ మాట్లాడేందుకే ఉపయోగపడేది.ఆ తరువాతి కాలంలో 2జీ, 3జీలు టెలికం రంగంలో చెప్పుకోదగ్గ మార్పులను తీసుకువచ్చాయి.
ఎస్.ఎమ్.ఎస్, వీడియో కాలింగ్, వెబ్ బ్రౌజింగ్ వంటి సదుపాయాలు ఈ జనరేషన్‌లో వచ్చినవే ఇక 4జీ మన దేశంలో చాలావరకు వాడుకలో ఉన్న నెట్‌వర్క్.స్పీడ్ డేటా,వీడియో స్ట్రీమింగ్, వాయిస్ చాటింగ్‌తో పాటు ఫోన్ లోనే బ్యాంకింగ్ సేవలు కూడా 4జీ కాలంలోనే అభివృద్ధి చెందాయి.. ఇక 5జీతో ఇప్పుడున్న స్పీడ్‌కు కొన్ని రెట్లు అధికంగా ఉంటుంది.వీఆర్,ఏఆర్ టెక్నాలజీతో స్పీడ్ పెరుగుతుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com