రాజకీయాల్లోకి కంగనా.. హిమాచల్ ప్రదేశ్‌లోని మండి నుండి పోటీ

రాజకీయాల్లోకి కంగనా.. హిమాచల్ ప్రదేశ్‌లోని మండి  నుండి పోటీ
తనను తాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభిమాని అని చెప్పుకునే కంగనా రనౌత్‌ తొలిసారిగా ఎన్నికలలో పోటీ చేస్తోంది.

భారతీయ జనతా పార్టీ (బిజెపి) వచ్చే లోక్‌సభ ఎన్నికలకు ఐదవ జాబితాను ఆదివారం విడుదల చేసింది. 111 మంది లోక్‌సభ అభ్యర్థుల జాబితాలో హిమాచల్ ప్రదేశ్‌లోని మండి నియోజకవర్గం నుంచి 'క్వీన్' నటి కంగనా రనౌత్ పేరు ఉంది.

మండి నియోజకవర్గం నుండి ఆమె పేరు ప్రకటించిన తర్వాత X లో బాలీవుడ్ నటుడు, రచయిత, నిర్మాత కంగన పార్టీలో అధికారికంగా చేరడం గౌరవంగా భావిస్తున్నట్లు పోస్ట్ చేశారు.

"నా ప్రియమైన భారతీయ జనతా పార్టీ (బిజెపి)కి ఎల్లప్పుడూ నా మద్దతు ఉంది. నేడు బిజెపి జాతీయ నాయకత్వం నా జన్మస్థలం హిమాచల్ ప్రదేశ్ మండి (నియోజకవర్గం) నుండి నన్ను లోక్‌సభ అభ్యర్థిగా ప్రకటించింది. ఇది హైకమాండ్ తీసుకున్న నిర్ణయం. పార్టీలో అధికారికంగా చేరినందుకు నేను సంతోషిస్తున్నాను. నేను ఒక విలువైన కార్యకర్త మరియు నమ్మకమైన ప్రజా సేవకుడిగా నా సేవలు అందించాలని ఎదురుచూస్తున్నాను" అని రనౌత్ పోస్ట్ చేశారు.అయితే బీజేపీ కండువా కప్పుకుని ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధమైన కంగనను అభినందిస్తూ కొందరు, విమర్శిస్తూ కొందరు పోస్టులు పెట్టారు.

నెటిజన్ల స్పందన

నాలుగేళ్ల క్రితం కొందరు రాజకీయ నాయకులు జేసీబీతో ఆమె స్టూడియోను కూల్చివేశారు. ఇప్పుడు ఈ అమ్మాయి మెజారిటీ పార్టీ నుంచి రాజకీయాల్లోకి వస్తోంది. వాట్ ఏ కమ్ బ్యాక్ క్వీన్!!, అంటూ సోషల్ మీడియా యూజర్ రాశారు.

“అభినందనలు! అని ఒక వినియోగదారు రాశారు.

కొంతమంది వినియోగదారులు మండిలో బాలీవుడ్ నటి కోసం ప్రచారం చేయడానికి కూడా ముందుకొచ్చారు.

“అభినందనలు మేము హిమాచల్‌లో మీ కోసం ప్రచారం చేయడానికి ఎదురుచూస్తున్నాము” అని ప్రకటన తర్వాత మరొక వినియోగదారు స్పందించారు.

నేడు, ఉద్ధవ్ ఠాక్రే & సంజయ్ రౌత్ తమ రాజకీయ మనుగడ కోసం పోరాడుతున్నారు. అయితే మీరు గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్నారు అని అన్నారు.

మరికొందరు మాత్రం కంగన కాషాయ పార్టీ ఎంపిక పట్ల పెద్దగా సంతోషంగా లేరని తెలుస్తోంది.

మీ డిపాజిట్‌ని తిరిగి పొందగలరా? మీరు 50,000 ఓట్ల తేడాతో ఓడిపోతారు అని ఎన్నికలకు ముందే అంచనా వేస్తున్నారు.

రెండేళ్ల క్రితమే మీరు మండి నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తారని ఒకరు చెప్పినప్పుడు.. సంక్లిష్టతలతో కూడిన రాష్ట్రం కావాలని, మండి నుంచి పోటీ చేయనని అన్నారు. కానీ ఇప్పుడు మాట మార్చి అదే నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. రాజకీయాల్లోకి రాకముందే పాలిటిక్స్ వంటబట్టించుకున్నారు అని మరో వినియోగదారుడు కంగనను విమర్శించారు.

Tags

Read MoreRead Less
Next Story