Rain update :హిమాచల్, ఉత్తరాఖండ్..మరో 5 రోజులు వర్షాలే.

Rain update :హిమాచల్, ఉత్తరాఖండ్..మరో 5 రోజులు వర్షాలే.
రెండు రాష్ట్రలు అప్రమత్తంగా ఉండాలన్న వాతావరణ శాఖ

భారీ వర్షాలు హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాల్లో వర బీభత్సం కొనసాగుతూనే ఉంది. . గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా.. రెండు రాష్ట్రాల్లో 65 మందికి పైగా మరణించినట్లు సమాచారం. వరదలు, కొండచరియలు విరిగిపడటం, భారీ వర్షాల కారణంగా అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. ఆస్తులకు కూడా చాలా నష్టం వాటిల్లింది. వర్షాలు, కొండచరియలు విరిగిపడటంతో చాలా చోట్ల మౌలిక వసతులు ధ్వంసమయ్యాయి.

హిమాచల్ ప్రదేశ్‌లో మృతుల సంఖ్య 60 కు చేరింది. సమ్మర్ హిల్, ఫాగ్లీ లో కొండ చర్యలు విరిగిపడిన ఘటనలిలో మృతుల సంఖ్య 19 కి చేరింది. శివాలయం ఘటనలో మరో ముగ్గురి మృత దేహాలు వెలికి తీశారు. ఇంకా రాష్ట్రంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గల్లంతైన వారిని గుర్తించడం రక్షించడంపై దృష్టి సారిస్తున్నారు. పలు ప్రధాన రహదారులను ఇప్పుడిప్పుడే పునరుద్ధరిస్తున్నారు. వర్షాలు మరదలు నేపథ్యంలో హిమాచల్ ప్రదేశ్ లోని యూనివర్సిటీలు తమ కార్యకలాపాలు నిలిపివేసాయి. రాష్ట్రంలో మొత్తం 12 జిల్లాలకు గాను 11 జిల్లాలలో 857 రోడ్లు బ్లాక్ అయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా ఏడు కోట్ల మేర ఆస్తి నష్టం జరిగింది. అటూ సిమ్లాలో రెండు కొండచరియలు విరిగిపడిన ప్రదేశాల నుండి ఇప్పటివరకు 14 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా.. శిథిలాల కింద మరింత మంది చిక్కుకుపోవచ్చని అధికారులు చెబుతున్నారు. మరోవైపు మండి జిల్లాలో కొండచరియలు విరిగిపడటంతో 24 మంది మరణించారు. ఇక్కడ బియాస్ నది నీటిమట్టం పెరగడంతో మండి బస్టాండ్ ముంపుకు గురి అయ్యింది.



మరోవైపు ఉత్తరాఖండ్‌లో కూడా వర్షాల తీవ్రత అధికంగానే ఉంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంతో అనేక ప్రాంతాలు దెబ్బతిన్నాయి. రోడ్లు, వంతెనలు కొట్టుకుపోయాయి. కేదార్‌నాథ్ యాత్ర నిలిచిపోయింది. గంగా నది మట్టం కూడా పెరుగుతుండటంతో అధికారులు అప్రమత్తం అయ్యారు.డెహ్రాడూన్, పౌరీ, టెహ్రీ, నైనిటాల్, చంపావత్, ఉధమ్ సింగ్ నగర్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసాయి. మరో 3 రోజులపాటు పరిస్థితి ఇలాగే ఉందంటున్న అధికారులు, ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నటు సమాచారం.

Tags

Read MoreRead Less
Next Story