Dengue: ఢిల్లీకి డెంగీ ముప్పు

Dengue:  ఢిల్లీకి డెంగీ ముప్పు
ఈ నెలలో భారీగా కేసుల నమోదు

ఢిల్లీ నగరం ఇంకా వరద నష్టం, కష్టం నుంచి తేరుకొనే లేదు ఇప్పుడు మరో ముప్పు వచ్చి పడింది. యమునాన నదికి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. ఈక్రమంలో ఢిల్లీ నగరంలో అంటువ్యాధులు ప్రబలుతున్నాయి. డెంగ్యు జ్వరాలతో జనాలు నానా బాధలు పడుతున్నారు. డెంగ్యు కేసులు రోజు రోజుకు పెరుగుతుండటంతో ప్రజలలో ఆందోళన నెలకొంది. ఇప్పటి వరకు 187 డెంగ్యు కేసులు నమోదు అయ్యాయి. వరద దెబ్బకి పారిశుద్ద్య సమస్యలు తలెత్తుతుండటంతో ఈ పరిస్థితి ఏర్పడింది. జులై 22 వరకు ఢిల్లీలో 187 డెంగ్యు కేసులు, 61 మలేరియా కేసులు నమోదు అయ్యాయి. ఇవి మరింత పెరిగే అవకాశం ఉండటంతో దోమల ఉత్పత్తిని అరికట్టడానికి, నిలవ నీటిని తొలగించేందుకు వ చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖలకు ఢిల్లీ పాలనా యంత్రాంగం ఆదేశాలు జారీ చేసింది.


భూతాపం పెరిగిపోతుండటం వల్ల దోమల సంతతి ఎక్కువై ఈ ఏడాది ప్రపంచ వ్యాప్తంగా డెంగీ కేసులు భారీగా పెరుగుతాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) తాజాగా హెచ్చరించింది. డెంగీ తీవ్రత ఎక్కువై మహమ్మారి ముప్పులా మారనుందని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ పరిస్థితి మనదేశం లోనే కాదు ప్రపంచం మొత్తం మీద ఉందని, గతేడాది ప్రపంచవ్యాప్తంగా డెంగీ కేసుల సంఖ్య ఎనిమిది రెట్లు పెరిగిందని పేర్కొంది. 2022లో అన్ని దేశాల్లో కలిపి 42 లక్షల కేసులు వచ్చినట్లు వెల్లడించింది. ఈ ఏడాది అమెరికాలో ఇప్పటికే 30 లక్షలకు పైగా డెంగీ పాజిటివ్‌లు నమోదయ్యాయని తెలిపింది.

సరిగ్గా ఇదే సమయంలో ఢిల్లీలోని మున్సిపల్ కార్మికులు సమ్మె హెచ్చరిక జారీ చేశారు. డిమాండ్లు నెరవేర్చకపోతే జులై 31 నుంచి సమ్మె చేస్తామంటూ ఇప్పటికే కమిషనర్ కు నోటీసు ఇచ్చారు. డిమాండ్లు పరిశీలిస్తామన్న ఢిల్లీ మేయర్ షెల్లీ ఒబెరాయ్, వరదలతో అతలాకుతలంగా మారిన క్రమంలో అంటువ్యాధులు ప్రబలుతుంటాయని ఇటువంటి పరిస్థితుల్లో సమ్మె చేయటం సరికాదని సూచించారు. కార్మికుల డిమాండ్లు పరిశీలిస్తామని తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సమ్మెకు పిలుపునిచ్చివారిలో 3,000 మంది డెంగ్యుకి సంబంధించిన కార్మికులు, 2,000మంది ఫీల్డ్ వర్కర్లు ఉన్నారు.

Tags

Read MoreRead Less
Next Story