6G Network Trails : 6జీ నెట్‌వర్క్ ట్రయల్స్ వేస్తున్న భారత్.. స్పీడ్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

6G Network Trails : 6జీ నెట్‌వర్క్ ట్రయల్స్ వేస్తున్న భారత్.. స్పీడ్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..
6G Network Trails : టెలికాం కంపెనీలు ప్రస్తుతం 6G ట్రయల్స్ చేస్తున్నాయి

6G Network Trails : టెలికాం కంపెనీలు ప్రస్తుతం 6G ట్రయల్స్ చేస్తున్నాయి.ఇప్పటికే 6G ట్రయల్స్‌లో మనదేశంలో కూడా ఉంది.నివేదికల ప్రకారం 6G ఇంటర్నెట్ వేగం 5G కంటే 50 రెట్లు వేగంగా ఉంటుందంట.వాస్తవానికి అన్ని దేశాలు 6G నెట్‌వర్క్ కోసం సిద్ధమవుతున్నాయి 6G కి సంబంధించిన టెక్నికల్‌ అంశాలపై ఓ అవగాహనకు వచ్చిన తరువాత వరల్డ్‌ వైడ్‌ మార్కెట్‌తో పాటు ఇండియాలో కూడా 6G సేవలను లాంచ్‌ చేయోచ్చన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది.

ప్రస్తుతం 6G నెట్‌వర్క్‌లో దిగ్గజ కంపెనీలు పనిచేస్తున్నాయి. వీటిలో శామ్‌సంగ్, ఎల్‌జీ, హువావే వంటి దిగ్గజాల పేర్లు వినిపిస్తున్నాయి. 2028-2030 నాటికి 6G నెట్‌వర్క్‌ను ప్రపంచవ్యాప్తంగా విస్తరించవచ్చని ఓ అంచనా . అందుకే ఇండియా కూడా 6G నెట్‌వర్క్ కోసం ట్రయల్స్‌ మొదలుపెట్టారు.

ఇక 5G నెట్‌వర్క్ 20Gbps వరకు మాక్సిమమ్‌ డేటా డౌన్‌లోడ్ వేగాన్ని అందిస్తుంది. దీనిపై ఎయిర్‌టెల్, వీఐ, జియో స్పీడ్ టెస్ట్ నిర్వహించాయి. ఇక 6G నెట్‌వర్క్‌ వేగం 1000 Gbpsకి చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. ఎల్‌జీ కూడా 6G నెట్‌వర్క్ ట్రయల్స్ ను జర్మనీలోని బెర్లిన్‌లో ప్రారంభించింది.6G నెట్‌వర్క్‌లో మీరు 6 GB డేటాని 51 సెకన్లలో 1000 మెగాబైట్ల వేగంతో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.6G నెట్‌వర్క్ 5G కంటే 50 రెట్లు వేగంగా ఉంటుంది.

జపాన్‌లో 6G నెట్‌వర్క్ 2030 నాటికి ప్రారంభమయ్యే ఛాన్స్‌ ఉంది. జపాన్‌తో పాటు, దక్షిణ కొరియా, చైనా, ఫిన్లాండ్ కూడా 6G నెట్‌వర్క్ కోసం సిద్ధమవుతున్నాయి. ఇప్పుడు భారతదేశంలో కూడా 6G నెట్‌వర్క్ కోసం సన్నాహాలు ప్రారంభమయ్యాయి. యూరోపియన్ యూనియన్‌లో 6G నెట్‌వర్క్‌ల కోసం మిలియన్ల యూరోలు ఖర్చు చేస్తున్నాయి.

మరోవైపు 6జీ టెక్నాల‌జీ అందుబాటులోకి వస్తే కామ‌న్ ఇంట‌ర్‌ఫేస్‌గా అంద‌రూ ఉప‌యోగించే స్మార్ట్‌ఫోన్‌ల స్ధానంలో ఏ డివైజ్ ఉంటుందన్న అంశంలో ఎలాంటి క్లారిటీ లేదు. ఇక కమర్శియల్‌ కోసం టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత 6G రోల్‌అవుట్ వేగంగా, సాఫీగా జరిగేలా చూసేందుకు ఇప్పటికే ఒక టాస్క్‌ఫోర్స్‌ను రూపొందించినట్లు ఇండియా కూడా ప్రకటించింది.

6G నెట్‌వర్క్ అల్ట్రా-రియలిస్టిక్ మొబైల్ హోలోగ్రామ్‌లు, యాంబియంట్ కంప్యూటింగ్, AR ,VRతో సహా అన్ని రకాల నెక్ట్స్‌ జనరేషన్‌ ఆపరేషన్‌లు 6G నెట్‌వర్క్‌తో సాధ్యం అవుతాయి.

మరోవైపు LG 6G నెట్‌వర్క్ పూర్తిస్థాయిలో 2025లో మొదలు కానుంది. ఇక కమర్షియల్‌ పరంగా నెట్‌వర్క్‌ 2029లో పూర్తిస్థాయి అపరేషన్లు మొదలు పెట్టనుంది.అయితే అప్పటికి మనదేశంలో పటిష్టమైన 5G నెట్‌వర్క్ బేస్ ఉంటుంది.

ఇండియాలో కొన్ని రోజుల్లో కొత్త కమ్యూనికేషన్ నెట్‌వర్క్ 5G ప్రారంభం అవుతుండగా 6G ట్రయిల్స్‌కు రెడీ అవుతోంది.ఈ దశాబ్దం చివరి నాటికి 6జీ సేవలు అందుబాటులోకి వస్తాయని టెలికాం నిపుణులు అంచనా వేస్తున్నారు.

Tags

Next Story