కులుపై విరిగిపడిన కొండచరియలు.. కుప్ప కూలిన 7 భవనాలు

కులుపై విరిగిపడిన కొండచరియలు.. కుప్ప కూలిన 7 భవనాలు
X
గురువారం ఉదయం హిమాచల్ ప్రదేశ్‌లోని కులులో అన్నీ అనే ప్రాంతంలో వర్షం కారణంగా కొండచరియలు విరిగిపడ్డాయి.

గురువారం ఉదయం హిమాచల్ ప్రదేశ్‌లోని కులులో అన్నీ అనే ప్రాంతంలో వర్షం కారణంగా కొండచరియలు విరిగిపడడంతో, బస్టాండ్ సమీపంలోని ఏడు భవనాలు కూలిపోయాయి. కూలుతున్న భవనాలు ప్రజలను భయభ్రాంతులకు గురిచేశాయి. భవనాలకు పగుళ్లు ఏర్పడడంతో అందులో నివసిస్తున్న వారిని అధికారులు మూడు రోజుల క్రితం ఖాళీ చేయించారు. లేకపోతే ప్రాణ నష్టం జరిగేది అని అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. భవనాలు కూలుతున్న విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Tags

Next Story