UP: కుప్పకూలిన వేదిక..ఏడుగురు మృతి.. 60 మందికి గాయాలు..

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం జరిగింది. బాగ్‌పత్‌లో జైనులు ఏర్పాటు చేసిన ఆదినాథుడి నిర్వాణ లడ్డూ మహోత్సవ్.. ఈ కార్యక్రమంలో చెక్కతో ఏర్పాటు చేసిన వేదిక ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందగా.. జైన శిష్యులు, పోలీసు సిబ్బందితో పాటు 60 మందికి పైగా గాయపడ్డారు. చాలా మంది శిథిలాల కింద చిక్కుకున్నట్లు తెలుస్తుంది. సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు అధికారులు.
ఇక, ఈ ప్రమాదంపై ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రియాక్ట్ అయ్యారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు వేగవంతం చేయడంతో పాటు గాయపడిన బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇక, మనోవైపు పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని.. విచారణ కొనసాగిస్తున్నారు. ఈ ఘటనలో ఇప్పటి వరకూ ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. సుమారు 50 మంది గాయపడ్డారు. ఘటన సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. స్వల్ప గాయాలైన వారికి ప్రథమ చికిత్స అనంతరం ఇంటికి పంపించారు. తీవ్ర గాయాలతో పలువురు చికిత్స పొందుతున్నట్లు బాగ్‌పత్ పోలీస్ చీఫ్ అర్పిత్ విజయవర్గియా తెలిపారు. మరోవైపు ఈ ప్రమాదంపై సీఎం యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. ప్రమాదం గురించి అధికారులను ఆరా తీశారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com