Mumbai :బైక్ ను సెవెన్ సిటర్ గా చేసిన వ్యక్తిపై హత్యానేరం

Mumbai :బైక్ ను సెవెన్ సిటర్ గా చేసిన వ్యక్తిపై  హత్యానేరం
వైరల్ వీడియో ఆధారంగా నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

మనం ప్రపంచంలో అన్నింటికంట సులువుగా చేసే పని రూల్స్ బ్రేక్ చెయ్యడం. అబ్బే ఎవడు చూడొచ్చాడులే, చూసినా ఎవరు పట్టించుకుంటారు మనల్ని, పోనీ ఎవరన్నా పట్టుకున్నారే అనుకో వందో, యాభైయ్యో ఇస్తే సరిపోతుంది. సరిగ్గా ఇలాగే ఆలోచిస్తారు మన దేశంలో వాహనదారులు. ముఖ్యంగా టూవీలర్ ఉన్నవాళ్లు. హెల్మెట్ పెట్టుకోరు, కొంతమందికి లైసెన్స్ ఉండదు, ఇంకొందరు లెక్కకు మించి బైక్ పై ఎక్కించుకొని యదేచ్చగా తిరిగేస్తూ ఉంటారు. ముంబైలో ఓ వ్యక్తి తన బైక్ పై ఒకరు, ఇద్దరు కాదు, ఏకంగా ఏడుగురు పిల్లల్ని ఎక్కించుకొని బయటకు వెళ్ళాడు. ఆ వీడియో వైరల్ గా మారింది. పోలీసులను చేరింది. దీనితో నిందితుడిపై హత్యానేరం కేసు పెట్టిన పోలీసులు నిర్లక్ష్యంగా బైక్ నడిపే వాళ్ళందరికీ షాక్ ఇచ్చారు. వివరాల్లోకి వెళితే..

ఒకే స్కూటీపై ఏడుగురు పిల్లల్ని తీసుకెళ్లిన వీడియో వైరల్ అయిన విషయం తెలిసిందే. ముంబైలో రద్దీగా ఉండే ఓ రోడ్డుపై ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ వీడియో లో వ్యక్తి పని అయిపోవడమే ముఖ్యం అనుకున్నాడేమోగానీ పిల్లల భద్రత, ఇతర వాహనదారుల భద్రత, ట్రాఫిక్ నిబంధనలు అన్నీ గాలికి వదిలేశాడు..

స్కూటీ వెనుక వైపు పిల్లాడు నిలబడగా మధ్యలో ముగ్గురు పిల్లలు కూర్చుని ఉన్నారు. మరోవైపు స్కూటీకి ఒక పిల్లడు ప్రమాదకరంగా వేలాడుతుండగా ముందువైపు ఇంకో ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ ప్రయాణాన్ని ఒక వ్యక్తి వీడియో తీశాడు. పోస్ట్ చేయడంతో పాటు ముంబై పోలీస్, సి పి, మహారాష్ట్ర ముఖ్యమంత్రికి కూడా ట్యాగ్ చేశాడు. దీంతో ముంబై పోలీసులు అలర్ట్ అయ్యారు. బైక్ ను డ్రైవ్ చేసిన వ్యక్తిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఐపీసీ సెక్షన్ 308 (IPC 308) ప్రకారం హత్యా నేరం నమోదు చేశారు. ఒక బైకర్ పై ఇలాంటి కేసు నమోదు కావటం ఇదే మొదటిసారి. ఈ సందర్భంగా వాహనదారులు ఎవరైనా అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. ముంబై ట్రాఫిక్ పోలీసులు షేర్ చేసిన ఈ పోస్ట్ కూడా వైరల్ గా మారింది. దీనిపై స్పందించిన నెటిజన్లు ఇలా కఠినమైన శిక్షలు విధించినప్పుడు మాత్రమే జనం మారుతారని అభిప్రాయపడుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story