Russia-Ukraine war: ఉక్రెయిన్​పై రష్యా డ్రోన్ దాడి

Russia-Ukraine war:  ఉక్రెయిన్​పై రష్యా డ్రోన్ దాడి
8 మంది మృతి

ఉక్రెయిన్​పై రష్యా దాడులను కొనసాగిస్తూనే ఉంది. శుక్రవారం రాత్రి ఉక్రెయిన్‌‌లోని రెండో అతిపెద్ద సిటీ అయిన ఖార్కిప్​పై డ్రోన్‌‌లు, క్షిపణులతో దాడి చేసింది. ఈ దాడిలో ఆరుగురు చనిపోయారు. మరో 11 మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు. క్షిపణి దాడులతో సిటీలోని ఇండ్లు, గ్యాస్ స్టేషన్, కేఫ్, దుకాణం, కార్లు దెబ్బతిన్నాయని ఖార్కివ్ ఏరియా గవర్నర్ చెప్పారు.

రష్యా.. 32 ఇరాన్ మేడ్​ షాహెద్ డ్రోన్‌‌లు, 6 క్షిపణులను ప్రయోగించిందని కమాండర్ తెలిపారు. అలాగే, ఉక్రెయిన్ వైమానిక రక్షణ దళాలు రష్యాకు చెందిన మూడు క్రూయిజ్ క్షిపణులు, 28 డ్రోన్‌‌లను కూల్చివేసినట్లు లెఫ్టినెంట్ జనరల్ మైకోలా ఒలేష్‌‌చుక్ తెలిపారు.

ఇక, షెవ్‌చెంకివ్‌స్కీ జిల్లాలో రాత్రిపూట జరిగిన దాడిలో శనివారం ఉదయం నాటికి ఆరుగురు మరణించారని, 10 మంది గాయపడ్డారని ఖార్కివ్ మేయర్ ఇహోర్ తెరెఖోవ్ టెలిగ్రామ్ మెసేజింగ్ యాప్‌లో తెలిపారు. ఆ తర్వాత మృతుల సంఖ్య 8కి పెరిగింది. అలాగే, ఈ దాడి జరిగిన తర్వాత అక్కడికి ప్రాంతీయ అధికారులు సహాయక చర్యలు కొనసాగించారు. ఉక్రెయిన్ స్థానిక అధికారులు, పోలీసులు ఖార్కీవ్ నగర వీధుల్లో తీవ్రంగా ధ్వంసమైన భవనాల పక్కన మండుతున్న మంటల ఫోటోలను సోషల్ మీడియాలో విడుదల చేశారు. గత 20 నెలలుగా రష్యా- ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతునే ఉంది. ఇప్పటికే ఉక్రెయిన్ లో వేల మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు.

Tags

Next Story