High Court : దేశంలోని ఎనిమిది హైకోర్టులకు కొత్త న్యాయమూర్తులు.

High Court : దేశంలోని ఎనిమిది హైకోర్టులకు కొత్త న్యాయమూర్తులు.
X
ఎక్స్‌ వేదికగా ఈ వివరాలను వెల్లడించిన కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్‌వాల్‌

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శనివారం దేశంలోని 8 హైకోర్టులకు ప్రధాన న్యాయమూర్తులను నియమించారు. కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్‌వాల్‌ ఎక్స్‌ వేదికగా ఈ వివరాలను తెలిపారు.భారత రాజ్యాంగం అందించిన అధికారాలను ఉపయోగించి, రాష్ట్రపతి కింది హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులను నియమించడం… బదిలీ చేయడం సంతోషంగా ఉందన్నారు.

ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా మన్మోహన్‌

ఢిల్లీ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మన్మోహన్‌ను ప్రధాన న్యాయమూర్తిగా నియమించినట్లు కూడా ఆయన చెప్పారు. మరోవైపు హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ రాజీవ్ శక్ధర్ నియమితులయ్యారు.

ఎంపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సురేష్ కుమార్

అదే విధంగా ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సురేష్ కుమార్ కైత్ మధ్యప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఇంద్ర ప్రసన్న ముఖర్జీ మేఘాలయ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు.

కేరళ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నితిన్ మధుకర్

అదేవిధంగా, బాంబే హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నితిన్ మధుకర్ జామ్దార్ కేరళ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. జమ్మూ కాశ్మీర్ మరియు లడఖ్ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి తాషి రబస్తాన్ జమ్మూ కాశ్మీర్ మరియు లడఖ్ హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు.

జార్ఖండ్ హైకోర్టు కొత్త ప్రధాన న్యాయమూర్తిగా ఎంఎస్ రామచంద్ర

బాంబే హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రీరామ్ కల్పనా రాజేంద్రన్ మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, జస్టిస్ ఎంఎస్ రామచంద్రరావు, హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జార్ఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు.

Tags

Next Story