Haryana: రోడ్డు ప్రమాదం.. 8 మంది యాత్రికులు మృతి

Haryana: రోడ్డు ప్రమాదం.. 8 మంది యాత్రికులు మృతి
X
హర్యానాలోని జింద్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో 8 మంది యాత్రికులు మృతి చెందగా, 10 మంది గాయపడ్డారు

కురుక్షేత్రలోని మార్చేడి గ్రామానికి చెందిన 18 మంది యాత్రికులు రాజస్థాన్‌లోని గోగమేడి వెళ్లేందుకు టాటా మ్యాజిక్ వాహనంలో ప్రయాణిస్తున్నారు. వారి వాహనాన్ని మార్చేడి గ్రామ సమీపంలో వేగంగా వస్తున్న ట్రక్కు వెనుక నుంచి ఢీకొట్టిందని సంబంధిత వర్గాలు తెలిపాయి.

హర్యానాలోని జింద్ జిల్లాలో సోమవారం అర్థరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది యాత్రికులు మరణించారు. 10 మంది గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బిద్రానా గ్రామ సమీపంలోని బిద్రానా-కైతాల్ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది.

ఏడుగురు యాత్రికులు అక్కడికక్కడే మరణించారు, తొమ్మిది మందిని నర్వానా సివిల్ ఆసుపత్రిలో చేర్చినట్లు నరవానా పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ కుల్దీప్ సింగ్ మీడియాకు తెలిపారు. మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి.

నర్వానా సివిల్ ఆసుపత్రిలో చేరిన వారిని ఆగ్రోహా మహారాజా అగ్రసేన్ మెడికల్ కాలేజీకి తరలించగా, ఉదయం మరో యాత్రికుడు మరణించినట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు.


Tags

Next Story