Indian Railways: గుజరాత్ ప్రత్యేక రైలులో ఫుడ్ పాయిజన్ కలకలం

Indian Railways: గుజరాత్ ప్రత్యేక రైలులో ఫుడ్ పాయిజన్ కలకలం
90 మందికి ఫుడ్ పాయిజన్

భారతీయ రైల్వేలో వడ్డిస్తున్న ఆహారంపై అనేక ఫిర్యాదులు ఉన్నాయి. అయితే వాటి తగ్గుదలలో వేగం కనిపించడం లేదు. తాజాగా చెన్నై నుంచి గుజరాత్ వెళ్తున్న ప్రత్యేక రైలులో ఫుడ్ పాయిజన్ కావడంతో 90 మంది ప్రయాణికులు అస్వస్థతకు గురయినట్లు తెలుస్తోంది. పీటీఐ కథనం ప్రకారం.. ప్రత్యేక రైలులో ప్రయాణిస్తున్న 90 మంది ప్రయాణికులు బుధవారం (నవంబర్ 29) ఫుడ్ పాయిజనింగ్ గురించి ఫిర్యాదు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. పూణే రైల్వే స్టేషన్‌లో ప్రయాణికులందరికీ వైద్య సహాయం అందించామని రైల్వే అధికారులు వెల్లడించారు.

ఈ ప్రత్యేక రైలు చెన్నై నుంచి గుజరాత్‌కు వెళ్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ ప్రయాణం మధ్యలో ఒక్కసారిగా ప్రయాణికుల ఆరోగ్యం క్షీణించింది. దీని కారణంగా నవంబర్ 28న రైలును పూణే స్టేషన్‌లో నిలిపివేసి ప్రయాణికులకు అవసరమైన వైద్య సహాయం అందించారు. పూణెలో రైలు 50 నిమిషాలు ఆగిన తర్వాత గమ్యస్థానానికి బయలుదేరింది. గుజరాత్‌లోని పాలిటానాలో జరిగే మతపరమైన కార్యక్రమం కోసం భారత్ గౌరవ్ రైలును ప్రత్యేకంగా బుక్ చేసినట్లు అధికారులు తెలిపారు.


బుధవారం నవంబర్ 29న షోలాపూర్ – పూణే మధ్య ఒక కోచ్‌లో సుమారు 40 మంది ప్రయాణికులు ఫుడ్ పాయిజన్‌కు గురయ్యారు. వికారం, విరేచనాలు, వాంతులు, తలనొప్పితో ఫిర్యాదు చేసినట్లు రైల్వే అధికారి తెలిపారు. దీంతో పూణే స్టేషన్‌లో ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. వైద్యుల బృందం ప్రయాణికులందరినీ జాగ్రత్తగా పరిశీలించి, చికిత్స అందించిందని చెప్పారు. దాదాపు 50 నిమిషాల తర్వాత రైలును గమ్యస్థానానికి బయలుదేరింది. ప్రస్తుతం ప్రయాణికులందరి పరిస్థితి నిలకడగా ఉందని అధికారులు తెలిపారు.

ఈ ప్రత్యేక రైలు చెన్నై నుంచి గుజరాత్‌కు వెళ్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ప్రయాణికుల ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించడంతో నవంబర్ 29న రైలును పూణే స్టేషన్‌లో ఆపాల్సి వచ్చిందన్నారు. గుజరాత్‌లోని పాలిటానాలో జరిగే మతపరమైన కార్యక్రమం కోసం భారత్ గౌరవ్ రైలును ప్రత్యేకంగా బుక్ చేసినట్లు అధికారులు తెలిపారు. రైల్వే మంత్రిత్వ శాఖ వర్గాల సమాచారం ప్రకారం, ఒక ప్రైవేట్ సంస్థ క్యాటరింగ్ సేవలను నడుపుతోంది. కంపెనీపై మంత్రిత్వ శాఖ చర్యలు తీసుకుంటుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆహారాన్ని రైల్వే ప్యాసింజర్ గ్రూప్ ప్రైవేట్‌గా కొనుగోలు చేసిందన్నారు.

Tags

Read MoreRead Less
Next Story