Madhya Pradesh: గోడ కూలి 9 మంది పిల్లలు మృతి

మధ్య ప్రదేశ్‌లోని సాగర్‌ జిల్లాలో ఘటన

మధ్య ప్రదేశ్‌లోని సాగర్‌ జిల్లాలో శిథిలమైన ఇంటి గోడ కూలడంతో తొమ్మిది మంది బాలలు మరణించగా, ఇద్దరు గాయపడ్డారు. షాపూర్‌ గ్రామంలో ఆదివారం ఉదయం 8.30 గంటలకు ఈ దుర్ఘటన జరిగింది. ఎమ్మెల్యే గోపాల్‌ భార్గవ మాట్లాడుతూ, దేవాలయం సమీపంలో, శిథిలమైన ఇంటివద్ద ఓ టెంట్‌లో పార్థివ శివ లింగాన్ని నిర్మించే కార్యక్రమం జరుగుతుండగా ఈ దారుణం జరిగిందని చెప్పారు. మృతులంతా 10 నుంచి 15 సంవత్సరాల వయసుగలవారే. కలెక్టర్‌ దీపక్‌ ఆర్య మాట్లాడుతూ, దేవాలయం సమీపంలోని ఇంటి వద్ద టెంట్‌లో ఈ బాలలు ఉన్నారని, వర్షాల వల్ల ఇంటి గోడ కూలిపోవడంతో ప్రమాదం జరిగిందని చెప్పారు. ఇద్దరు బాలలు అక్కడికక్కడే మరణించగా, ఏడుగురు దవాఖానకు తీసుకెళ్తుండగా మార్గమధ్యంలో ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు. గాయపడిన మరో ఇద్దరు బాలలు చికిత్స పొందుతున్నారన్నారు.

Tags

Next Story