Brazil : డ్రగ్స్ ముఠా లక్ష్యంగా పోలీసు కాల్పులు

Brazil :  డ్రగ్స్  ముఠా లక్ష్యంగా పోలీసు కాల్పులు
దేశ వ్యాప్తంగా 45 మంది మృతి

బ్రెజిల్ దేశంలో మూడు రాష్ట్రల్లో డ్రగ్స్ ముఠాలను లక్ష్యంగా చేసుకొని పోలీసులు జరిపిన కాల్పుల్లో ఆరు రోజుల్లో మరణించిన వారి సంఖ్య 45 కి చేరింది. తాజాగా రియో డి జెనీరో నగరంలో పోలీసులు జరిపిన దాడిలో 9 మంది మరణించారని బ్రెజిల్ అధికారులు తెలిపారు. ప్రతి దాడుల్లో మరో ఇద్దరు అధికారులు గాయపడ్డారు. గౌరుజా నివాసితులు బుధవారం పోలీసులకు వ్యతిరేకంగా బ్యానర్లు పట్టుకుని నిరసన తెలిపారు.బుల్లెట్ గాయాలైన వారు మొత్తం 11 మంది కాగా ఆసుపత్రికి తరలించేసరికే 9మంది మరణించారని వైద్యులు ప్రకటించారు.

రియో డి జెనీరోలోని మురికివాడల సముదాయంలో క్రిమినల్ ముఠాలను లక్ష్యంగా చేసుకున్న పోలీసు ఆపరేషన్‌లో బుధవారం కనీసం తొమ్మిది మంది మరణించారని అధికారులు తెలిపారు, బ్రెజిల్ అంతటా ఇటువంటి దాడులు జరుగుతున్నాయి.


ఇందులో సావో పాలో రాష్ట్రంలో 14 మంది, ఈశాన్య రాష్ట్రమైన బహియాలో 19 మరణించగా ఇప్పుడు మరో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. సావో పాలో రాష్ట్రంలో జరిగిన ఆపరేషన్ లో 5 మందిని అదుపులోకి తీసుకున్నారు అలాగే 385 కిలోల బాధక ద్రవ్యాలు తుపాకీలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు నిందితులని పట్టుకోవడానికి వెళ్లగా నిందితులే మొదటిసారి కాల్పులు జరిపారని తర్వాత మాత్రమే పోలీసులు కాల్పులు జరు పవలసి వచ్చిందని చెప్పారు. మాదకద్రవ్యాల ముఠాలపై చేస్తున్న దాడులలో భద్రతా దళాలు భారీ ఆయుధాలతో పాల్గొంటున్నారని ఇది మానవ హక్కుల ఉల్లంఘన అని హ్యూమన్ రైట్ కమిషన్ ఆరోపిస్తోంది. ఈ సంవత్సరం ప్రారంభం నుంచి రియో ప్రాంతంలో ఇటువంటి సంఘటనలు మొత్తం 33 జరిగాయని, వాటిలో 125 మంది ప్రాణాలు కోల్పోయారని తెలుస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story