Tamil Nadu: కరెంట్ షాక్ కి గురైన బాలుడు..ప్రాణాలకు తెగించి కాపాడిన యువకుడు

Tamil Nadu: కరెంట్ షాక్ కి గురైన బాలుడు..ప్రాణాలకు తెగించి కాపాడిన యువకుడు
X
సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో..

తమిళనాడు రాష్ట్రంలోని చెన్నైలో విద్యుత్ షాక్‌కు గురైన బాలుడిని ఓ యువకుడు తన ప్రాణాలను పణంగా పెట్టి మరి రక్షించిన ఘటన సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అయితే, భారీ వర్షం కురవడంతో రోడ్డుపై వరద నీరు నిలిచింది.. అయితే, అటుగా 3వ తరగతి విద్యార్థి నడుస్తు వెళ్తుండగా, సమీపంలోని జంక్షన్ బాక్స్ నుంచి కరెంట్ వైర్ తెగి పడిపోయింది.. దాంతో ఆ బాలుడు షాక్‌కు గురయ్యాడు. అటు వైపుగా వెళుతున్న వారు ఎవరూ కూడా ఆ పిల్లాడి రక్షించడానికి ముందుకు వెళ్లలేదు.. కానీ, అది గమనించిన యువకుడు కన్నన్, ధైర్యంగా ముందుకు వెళ్లి ఆ బాలుడిని రక్షించాడు.

ఇక, ఆ తర్వాత బాలుడికి సీపీఆర్ చేసి ఊపిరి అందించాడు.. అనంతరం స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. దీంతో ప్రాణాలకు తెగించి బాలుడిని కాపాడిన యువకుడికి తమిళనాడు వ్యాప్తంగా అభినందనలు తెలియజేస్తున్నారు.

Tags

Next Story