Chhattisgarh: వరదల బీభత్సం.. కొట్టుకుపోయిన రేషన్ బియ్యం లోడ్ లారీ..

X
Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో వరదలకు ఓ లారీ కొట్టుకుపోయింది. బీజాపూర్ జిల్లాలో రేషన్ బియ్యం లోడ్‌తో వెళ్తున్న లారీ.. వరదల ధాటికి వాగులో కొట్టుకెళ్లింది. లారీ వంతెన దాటుతుండగా.. ఇంజన్ ఆగిపోయింది. అదే సమయంలో వరద ప్రవాహం ముంచెత్తింది. చూస్తుండగానే లారీ పైవరకు వరద నీరు వచ్చేసింది. వాగు ఉధృతికి బియ్యం బస్తా లోడ్‌తో ఉన్న లారీ పల్టీలు కొడుతూ మరీ కొట్టుకుపోయింది. అప్పటికే లారీ డ్రైవర్ వంతెన దాటి బయటికి వచ్చేశాడు. వాళ్ల కళ్ల ముందే లారీ నీళ్లల్లోకి జారిపోయింది. భూపాలపట్నం సబ్ డివిజన్ మెట్టుపల్లి మీదుగా ప్రవహించే బడా నాలాలో ఈ ప్రమాదం జరిగింది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
