కామన్ మ్యాన్ కోసం వందే భారత్ తరహాలో కొత్త నాన్-ఏసీ రైలు..

సామాన్యులు వందే భారత్ రైలును అందుకోవడం కష్టం. టికెట్ రేటు ఎక్కువగా ఉంటుంది. భారతీయ రైల్వే సామాన్యులను దృష్టిలో పెట్టుకుని వారి కోసం కొత్త నాన్-ఏసీ రైలును అందుబాటులోకి తీసుకురావాలని చూస్తోంది. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను పెంచిన తర్వాత , భారతీయ రైల్వే ఇప్పుడు అప్‌గ్రేడ్ చేసిన సెకండ్ క్లాస్ అన్‌రిజర్వ్‌డ్,సెకండ్ క్లాస్ 3-టైర్ స్లీపర్ కోచ్‌లతో కొత్త రైలును తయారు చేయాలని భావిస్తోంది.
కొత్త రైలు పేరు ఇంకా నిర్ణయించలేదు. అయితే సామాన్యులకు మెరుగైన ప్రయాణ అనుభవం ఉన్న రైలును తయారు చేయాలనే ఆలోచనలో ఉన్న రైల్వే శాఖ.. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల తరహాలో కొత్త రైలులో కొన్ని ఫీచర్లు ఉంటాయని అధికారులు జాతీయ మీడియాకు తెలిపారు. ఈ రైలులో 2 సెకండ్ లగేజీ, గార్డ్ & దివ్యాంగులకు అనుకూలమైన కోచ్‌లు, 8 సెకండ్ క్లాస్ అన్‌రిజర్వ్‌డ్ కోచ్‌లు మరియు 12 సెకండ్ క్లాస్ 3-టైర్ స్లీపర్ కోచ్‌లు ఉంటాయి. అన్ని కోచ్‌లు నాన్-ఏసీగా ఉంటాయి.
ఈ కొత్త రైలుకు సంబంధించిన లోకోమోటివ్‌లను చిత్తరంజన్ లోకోమోటివ్ వర్క్స్ (CLW)లో తయారు చేస్తున్నారు. రైలు కోచ్‌లను చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ICF)లో తయారు చేస్తారు. ప్రస్తుతం వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను తయారు చేస్తున్న ఏకైక భారతీయ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ICF. రైల్వే బోర్డ్ అక్టోబర్‌లో కొత్త రైలు తయారీకి లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ఈ ఏడాది చివరి నాటికి కొత్త రైలు నమూనాను రూపొందించాలని భావిస్తున్నట్లు రైల్వే అధికారి తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com