Delhi: విగ్గులో బంగారం.. ఢిల్లీ విమానాశ్రయంలో నిందితుడి అరెస్ట్..

X
Delhi: సిసీ పక్కీలో అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని ఢిల్లీ అంతర్జాతీయ విమనాశ్రయంలో అధికారులు పట్టుకున్నారు. అబుదాబి నుంచి ఢిల్లీకి వచ్చిన ప్రయాణీకుడి వద్ద 31లక్షల విలువ చేసే 685 గ్రాముల బంగారాన్ని సీజ్ చేశారు కస్టమ్స్ అధికారులు. సినీ పక్కీలో బంగారాన్ని పేస్టుగా మార్చి.. ప్లాస్టిక్ కవర్‌లో ప్యాకింగ్ చేసి తలకు విగ్గులోపల దాచుకొని వచ్చాడు నిందితుడు. అనుమానం రావడంతో అధికారులు అతన్ని అదుపులోకి తీసుకొని తమదైన స్టైల్‌లో విచారించడంతో గుట్టురట్టైంది. బంగారాన్ని స్వాధీనం చేసుకొని అతన్ని అరెస్టు చేశారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
