రాజస్టాన్ ప్రేమికురాలు ప్రియుడికోసం పాకిస్థాన్ కు.. ఎయిర్ పోర్ట్ లో వింత కథ

రాజస్థాన్ యువతి తన ప్రేమికుడిని కలిసేందుకు పాకిస్థాన్ వెళుతున్నట్లు ఓ ఫేక్ స్టోరీ సృష్టించింది. ఆమెను జైపూర్ విమానాశ్రయ అధికారులు పోలీసులకు అప్పగించారు.
రాజస్థాన్‌లోని సికార్ జిల్లాకు చెందిన ఓ మైనర్ బాలిక తన ప్రేమికుడిని కలవడానికి పాకిస్థాన్ వెళ్లాలనుకుంటున్నట్లు శుక్రవారం జైపూర్ విమానాశ్రయానికి చేరుకుంది. ఆమె వద్ద పాస్‌పోర్ట్ లేదు, వీసా లేదు, మరే ఇతర డాక్యుమెంట్లూ లేవు. దీంతో అనుమానం వచ్చిన జైపూర్ విమానాశ్రయ అధికారులు ఆమెను పోలీసులకు అప్పగించారు.
ఏందమ్మాయ్ ఈ పని అని అడిగిన పోలీసులను షాక్ కి గురి చేసింది. ఇదంతా మీడియా దృష్టిని ఆకర్షించడానికే చేశానని చెప్పింది. ఈ మధ్య వార్తల్లో సరిహద్దులు దాటిన ప్రేమకథలు ఎక్కువగా వినిపిస్తుండే సరికి తాను కూడా ఓ చిన్న స్టోరీ అల్లుదామనుకుంది. కానీ అది కాస్తా బెడిసి కొట్టింది. అడ్డంగా బుక్కయ్యింది. అయితేనేం వార్తల్లోకి ఎక్కింది. అదే కదా ఆమెకు కావలసింది.
“నిన్న జైపూర్ ఎయిర్‌పోర్ట్‌లో ఓ మైనర్‌ని అదుపులోకి తీసుకున్నారు.. ఆమె తన లవర్‌ను కలిసేందుకు లాహోర్‌కు వెళ్లాలనుకుంటున్నానని తెలిపింది. ఆ మైనర్ ఎయిర్‌పోర్ట్‌లోని టికెట్ కౌంటర్ వద్దకు చేరుకుని పాకిస్థాన్‌కు వెళ్లేందుకు టికెట్ అడగడంతో అందరూ ఆశ్చర్యపోయారు. అమ్మాయి మైనర్ దాంతో టికెట్ మాస్టర్, సెక్యూరిటీ గార్డు ఆ అమ్మాయి ఏదో తమాషా చేస్తున్నట్లు భావించారు. అక్కడికక్కడే ఆమెను నిలదీశారు.
అధికారులను ఒప్పించేందుకు, విమానాశ్రయంలో అధికారులతో ఎలా ప్రవర్తించాలో పాకిస్థానీ అబ్బాయి తనకు చెప్పాడని బాలిక విచారణాధికారులకు తెలిపింది. తాను ఇస్లామాబాద్ నుంచి మూడేళ్ల క్రితం భారత్‌కు వచ్చానని, తన అత్తతో కలిసి జీవిస్తున్నానని బాలిక నకిలీ కథనం సృష్టించింది. ఇప్పుడు వారి మధ్య సఖ్యత లేకపోవడంతో తాను పాకిస్థాన్‌కు తిరిగి వెళ్లాలనుకుంటున్నట్లు ఆ బాలిక తెలిపింది.
బాలిక మాటలు విని సెక్యూరిటీ గార్డులు మొదట నిజమే అనుకుని నమ్మారు. కానీ విచారణలో అదంతా ఓ కట్టుకధ అని తెలుసుకున్నారు. ఆమె రాజస్థాన్‌లోని సికర్ జిల్లా రతన్‌పురా గ్రామ నివాసి అని తెలిసి తల్లిదండ్రులను పిలిపించి ఆ బాలికను ఇంటికి పంపించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com