అయోధ్య రాముడి కోసం అరుదైన గంట.. మోగిస్తే ఓంకార శబ్ధం

అయోధ్య రాముడి కోసం అరుదైన గంట.. మోగిస్తే ఓంకార శబ్ధం
ఆ అయోధ్యా రాముడికి తమ చేతులతో ఏ చిన్న వస్తువు చిన్న ఎంతో ఆత్మ సంతృప్తి కలుగుతుందని భక్తులు భావిస్తున్నారు.

ఆ అయోధ్యా రాముడికి తమ చేతులతో ఏ చిన్న వస్తువు చిన్న ఎంతో ఆత్మ సంతృప్తి కలుగుతుందని భక్తులు భావిస్తున్నారు. దేశం నలుమూలల నుంచి చిన్న ఇటుక అయినా తెచ్చి స్వామి వారి ఆలయ నిర్మాణంలో తాము భాగస్వాములం కావాలని తలుస్తున్నారు.

ఉత్తరప్రదేశ్ కు చెందిన ఓ కుటుంబం రూ.25 లక్షలు వెచ్చించి 2500 కిలోల భారీ గంటను స్వామి వారికి విరాళంగా ఇచ్చేందుకు సిద్ధమైంది. ఎటా జిల్లాకు చెందిన గంటలు తయారు చేసే కుటుంబం ఈ గంటను రూపొందిస్తుంది. దీనిని మోగించినప్పుడు ఓంకార శబ్ధం రావడం దీని ప్రత్యేకత అని తయారీదారులు చెబుతున్నారు. ఈ గంటను జింక్, రాగి, సీసం, టిన్, నికెల్, వెండి, బంగారం వంటి 8 లోహాలతో తయారు చేశామని చెప్పారు. ఈ గంట 6 అడుగుల ఎత్తు, 5 అడుగుల పొడవు, 15 అడుగుల వెడల్పు ఉంటుందని తెలిపారు. దీనిని తయారు చేయడానికి 250 మంది కార్మికులు, మూడు నెలల పాటు శ్రమించి తయారు చేసారని నిర్వాహకులు తెలిపారు.

అయోధ్య రామ మందిరానికి గంటను తయారు చేసి ఇవ్వాలనే ఆలోచన వచ్చింది. అంగీకారం కోసం రామ మందిర నిర్మాణ ట్రస్ట్ ను సంప్రదించాము. వారు తమ సమ్మతిని తెలియజేయడంతో గంట తయారీకి పూనుకున్నాము. మొదట 1700 కిలోల బరువుతో గంట తయారీ పూర్తవుతుందనుకున్నాము. కానీ తరువాత చూస్తే 1900 కిలోలకు వచ్చింది. చివరిగా గంటకు అన్ని మెరుగులు దిద్దేసరికి గంట బరువు 2500 కిలోలకు చేరుకుంది అని నిర్వాహకులు తెలియజేశారు.

అయోధ్య రామమందిరంలో శ్రీరాముని విగ్రహ ప్రతిష్ఠాపన జనవరి 22, 2024న మధ్యాహ్నం 12.30 గంటలకు జరుగుతుందని శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ ధృవీకరించింది. ఈ వేడుకకు ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానించారు ఆలయ ట్రస్ట్ నిర్వాహకులు. ఒకేసారి 75 వేల మంది భక్తులు స్వామి వారిని దర్శించుకునే వీలు కలుగుతుందని నిర్వాహకులు తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story