Fish bite: చేప కొరికితే అంత డేంజరా .. ఏకంగా చెయ్యే తీసేశారు

Fish bite: చేప కొరికితే  అంత డేంజరా .. ఏకంగా చెయ్యే తీసేశారు
X
వేలుకి చిన్న గాయం.. లైట్ తీసుకోవడంతో చెయ్యే పోయింది..

చేప కొరడంతో గాయమైన ఓ వ్యక్తి అరచేతిని వైద్యులు తొలగించారు. ప్రాణాలకు ప్రమాదం వాటిల్లకుండా ముందుజాగ్రత్త చర్యగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వైద్యులు తెలిపారు. కేరళలో ఈ ఘటన జరిగింది. అక్కడి… కన్నూర్​ జిల్లాలోని థలస్సెరీ ప్రాంతానికి చెందిన టి.రాజేశ్ అనే రైతు.. స్థానికంగా ఉన్న చిన్న నీటి గుంటను క్లీన్ చేస్తున్నాడు. అప్పుడు కడు అనే జాతికి చెందిన ఓ చేప కొరకడంతో.. అతని కుడి చేతి వేలుపై చిన్న గాయమైంది. అది ఏమవుతుందిలే అని స్థానికంగా ఉన్న పీహెచ్‌సీ వెళ్లి ప్రాథమిక చికిత్స చేయించుకున్నాడు. అక్కడిచ్చిన మెడిసిన్స్ వేసుకున్నా.. గాయం మానలేదు. కొద్ది రోజుల తర్వాత చేయి నొప్పి భయానకంగా మారింది. అంతేకాదు అరచేతిపై బొబ్బలు కూడా వచ్చాయి. దీంతో దగ్గర్లోని మహే ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లాడు. అక్కడు డాక్టర్లు రాజేశ్ పరిస్థితిపై పూర్తి అవగాహనకు రాలేకపోయారు. దీంతో కోజికోడ్ బేబీ మెమోరియల్ ఆస్పత్రికి రిఫర్ చేశారు.

బేబీ మెమోరియల్ వైద్యులు రాజేశ్​కు అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించి.. అతనికి గ్యాస్ గ్యాంగ్రీన్​ అనే బ్యాక్టీరియాల్ ఇన్ఫెక్షన్ సోకిందని నిర్ధారించారు. చేతి వేళ్లను తొలగించకపోతే ఆ బ్యాక్టీరియా పైకి పాకి.. మరింత సోకే ప్రమాదం ఉంటుందని హెచ్చరించారు. దీంతో అతడి సమ్మతి మేరకు రాజేశ్​ చేతి వేళ్లను తొలగించారు డాక్టర్లు. అయినా పరిస్థితి అదుపులోకి రాలేదు. ఇన్ఫెక్షన్ ఇంకాస్త పైకి వ్యాప్తించింది. దీంతో రాజేశ్​ అరచేతి మొత్తాన్ని తొలగించాల్సి వచ్చింది.

బురద నీటిలో కనిపించే క్లోస్ట్రడియం పెర్ఫ్రింజెన్స్ అనే బ్యాక్టీరియ వల్ల ఈ గ్యాస్​ గ్యాంగ్రీన్ అనే ఇన్ఫెక్షన్ వస్తుందని బేబీ మెమోరియాల్ ఆస్పత్రి వైద్యలు కృష్ణకుమార్ తెలిపారు. ఈ బ్యాక్టీరియా బాడీలోకి ప్రవేశించి కణాలను నాశనం చేస్తుందన్నారు. ఇన్ఫెక్షన్​ మెదడుకు వ్యాప్తిస్తే ప్రాణాలకే ప్రమాదమన్నారు. రాజేశ్​ అరచేతిని తొలగించడం తప్ప మరో ఆప్షన్ లేకుండా పోయిందని కృష్ణకుమార్ చెప్పారు. చేతి వేలి గాయం ద్వారా ఆ బ్యాక్టీరియా శరీరం లోపలికి ప్రవేశించి ఉండవచ్చని అంచనా వేశారు. లక్షమందిలో ఒకరిద్దరికి మాత్రమే ఇలాంటి పరిస్థితి వస్తుందని తెలిపారు. కేరళలో ఈ వ్యాధి ఇద్దరికి సోకగా అందులో రాజేశ్ ఒకరు కావడం గమనార్హం.

Tags

Next Story