తల్లి కోరికను నెరవేరుస్తున్న తనయుడు..

తల్లి కోరికను నెరవేరుస్తున్న తనయుడు..
రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, చైర్ పర్సన్ అయిన నీతా అంబానీ తన చిన్న కుమారుడు అనంత్ అంబానీ రాధిక మర్చంట్‌తో వివాహానికి సిద్ధపడినప్పుడు తనకు రెండు "ముఖ్యమైన కోరికలు" ఉన్నాయని చెప్పారు.

రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, చైర్ పర్సన్ అయిన నీతా అంబానీ తన చిన్న కుమారుడు అనంత్ అంబానీ రాధిక మర్చంట్‌తో వివాహానికి సిద్ధపడినప్పుడు తనకు రెండు "ముఖ్యమైన కోరికలు" ఉన్నాయని చెప్పారు.

పెళ్లికి ముందు ప్రీ వెడ్డింగ్ వేడుకల కోసం గుజరాత్‌లోని జామ్‌నగర్‌ను ఎందుకు ఎంచుకున్నారో ఈ రెండు కోరికలు వివరిస్తాయి. దేశంలోనే ప్రముఖ వ్యాపార వేత్త అయిన ముఖేష్ అంబానీ భార్య అయిన నీతా అంబానీ ఒక వీడియోలో, "రాధికతో నా చిన్న కొడుకు అనంత్ పెళ్లి ప్రస్తావన వచ్చినప్పుడు, నాకు రెండు ముఖ్యమైన కోరికలు ఉన్నాయి - మొదట, నేను మా మూలాలు మొదలైన చోట జరుపుకోవాలనుకున్నాను. రెండవది, ఈ వేడుక మన కళలు, సంస్కృతికి నివాళిగా ఉండాలని కోరుకుంటున్నాను" అని ఆమె చెప్పింది.

తన జీవితమంతా కళలు, సంస్కృతి నుండి ప్రేరణ పొందానని, అది తనను "లోతుగా కదిలించింది" మరియు తాను ఎల్లప్పుడూ అదే "మక్కువ" కలిగి ఉన్నానని నీతా అంబానీ వీడియోలో పేర్కొన్నారు. నీతా అంబానీ ఇంకా మాట్లాడుతూ జామ్‌నగర్‌కు తమ హృదయాల్లో ప్రత్యేక స్థానం ఉందని, దానికి ఎంతో ప్రాముఖ్యత ఉందన్నారు.

"మేము గుజరాత్ నుండే వచ్చాము. ఇక్కడే ముఖేష్, అతని తండ్రి (ధీరూభాయ్ అంబానీ) రిఫైనరీని నిర్మించారు. నేను ఈ ఎడారి లాంటి ప్రాంతాన్ని పచ్చటి టౌన్‌షిప్ మరియు శక్తివంతమైన కమ్యూనిటీగా మార్చడం ద్వారా నా వృత్తిని ప్రారంభించాను" అని ఆమె వీడియోలో చెప్పారు. కళలు, సంస్కృతిని ప్రదర్శించే వివాహ వేడుకలో, నీతా అంబానీ మాట్లాడుతూ, వారి వారసత్వం, సంస్కృతికి ప్రతిబింబంగా ఈ కార్యక్రమం ఉండాలని కోరుకుంటున్నాను.

అనంత్ అంబానీ, రాధిక మర్చంట్‌ల వివాహానికి ముందు జరిగే ఉత్సవాల్లో ప్రపంచ సంచలనం రిహన్న, మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ మరియు అతని భార్య ప్రిసిల్లా చాన్, బాలీవుడ్ బ్యూటీఫుల్ కపుల్స్ దీపికా పదుకొనే మరియు రణవీర్ సింగ్‌లతో సహా దాదాపు 1,000 మంది వ్యక్తులు హాజరవుతారని భావిస్తున్నారు. ప్రముఖులకు జామ్‌నగర్‌లోని రిలయన్స్ గ్రీన్స్ కాంప్లెక్స్‌లో ఆతిథ్యం ఇవ్వనున్నారు.

గురువారం, వారి కుటుంబ సంప్రదాయంలో భాగంగా అనంత్ అంబానీ, అతని కాబోయే భార్య రాధిక మర్చంట్ జామ్‌నగర్‌లోని రిలయన్స్ టౌన్‌షిప్ సమీపంలోని జోగ్వాడ్ గ్రామంలో సుమారు 51,000 మందికి భోజనాలు ఏర్పాటు చేశారు.

Tags

Read MoreRead Less
Next Story