నిర్మాణంలో ఉన్న ఆసుపత్రి బేస్‌మెంట్ కూలి మహిళ మృతి.. ఎనిమిది మందికి గాయాలు

నిర్మాణంలో ఉన్న ఆసుపత్రి బేస్‌మెంట్ కూలి మహిళ మృతి..  ఎనిమిది మందికి గాయాలు
X
ద్వారకలో నిర్మాణంలో ఉన్న ఆసుపత్రి బేస్‌మెంట్ కూలిపోవడంతో మహిళ మృతి చెందగా, ఎనిమిది మందికి గాయాలయ్యాయి.

ద్వారకలోని సెక్టార్ -12లోని ఆసుపత్రి నిర్మాణంలో ఉన్న బేస్‌మెంట్ గురువారం అర్థరాత్రి కుప్పకూలడంతో ఒకరు మరణించారు. ఎనిమిది మంది గాయపడ్డారు.

ప్రమాద స్థలాన్ని పరిశీలించేందుకు క్రైం బృందానికి సమాచారం అందించామని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో మృతి చెందిన మృతురాలి భర్త సంతోష్ మాట్లాడుతూ.. నేను, నా భార్య ఇక్కడే పని చేస్తున్నాం.. సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. నా భార్య చనిపోయింది. దాదాపు 25-30 మందికి గాయాలయ్యాయి అని తెలిపాడు.

అంతకుముందు జూలై 22న పంజాబీ బాగ్ ప్రాంతంలో డీటీసీ ఎలక్ట్రిక్ బస్సు మెట్రో పిల్లర్‌ను ఢీకొనడంతో 45 ఏళ్ల మహిళ మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. బస్సు సడన్ బ్రేక్ వేయడంతో వెనుక నుంచి వస్తున్న ఆటో రిక్షా బస్సును ఢీకొట్టడంతో అందులో ప్రయాణిస్తున్న వారికి గాయాలయ్యాయి.

Tags

Next Story