Bihar: బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌పై దాడి.. సెక్యూరిటీని దాటుకొని..

X
By - Divya Reddy |27 March 2022 8:15 PM IST
Bihar: బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌పై దాడి కలకలం రేపుతోంది.
Bihar: బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌పై దాడి కలకలం రేపుతోంది.. సెక్యూరిటీ సిబ్బందిని దాటుకుని వెళ్లి మరీ ఓ యువకుడు నితీష్ కుమార్‌పై దాడిచేయడం అక్కడ సంచలనంగా మారింది.. పాట్నా సమీపంలోని భక్తయర్‌పూర్‌లో ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు ముఖ్యమంత్రి నితీష్ కుమార్.. అయితే, ప్రోగ్రామ్ జరుగుతుండగానే ఓ యువకుడు మెరుపు వేగంతో ఆయన దగ్గరకు దూసుకొచ్చాడు.. చుట్టూ సెక్యూరిటీ ఉన్నా వారందరినీ తోసుకుంటూ వచ్చి ముఖ్యమంత్రిపై దాడిచేశాడు.. ఊహించని ఈ ఘటనతో అక్కడున్నవారంతా షాక్‌కు గురయ్యారు.. వెంటనే తేరుకుని ఆ యువకుణ్ని అదుపులోకి తీసుకున్నారు. అటు ముఖ్యమంత్రి పాల్గొనే కార్యక్రమంలో భద్రతా వైఫల్యం ఈ ఘటనతో స్పష్టమైందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com