Arvind Kejriwal: కేజ్రీవాల్‌పై దాడి

ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ పై దాడికి ప్రయత్నించారు. కేజ్రీవాల్ పాదయాత్ర చేస్తున్న సమయంలో వికాస్‌పురిలో ఈ ఘటన చోటుచేసుకుంది. ‘కొందరు బీజేపీ గూండాలు తమపై దాడికి ప్రయత్నించారు’ అని ఆప్ చెబుతోంది. ‘బీజేపీ గూండాలు కేజ్రీవాల్ దగ్గరికి వచ్చారని, పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేయలేదని’ ఆప్ ఆరోపించింది. ఈ ఘటనను పార్టీ సీరియస్‌గా తీసుకుని పోలీసులపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఢిల్లీ ప్రభుత్వ మంత్రి సౌరభ్ భరద్వాజ్ సోషల్ మీడియా ఎక్స్‌లో ఒక పోస్ట్ చేశారు. ఈడీ, సీబీఐ, జైలుతో కేజ్రీవాల్‌ను అణిచివేయాలని ప్రయత్నించగా.. ఫలించలేదని.. దీంతో బీజేపీ ప్రజలు అరవింద్ కేజ్రీవాల్ జీపై దాడికి యత్నించిందని ఆరోపించారు. కేజ్రీవాల్‌కి ఏదైనా జరిగితే దానికి నేరుగా బీజేపీయే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు
ఆప్ నాయకుడు సంజయ్ సింగ్ ఎక్స్‌లో ఒక వీడియోను పోస్ట్ చేశారు. “బీజేపీకి అరవింద్ కేజ్రీవాల్ శత్రువులుగా మారారు. మొదట ఈడీ-సీబీఐని ఉపయోగించి తప్పుడు కేసులు పెట్టి, జైల్లో పెట్టి, ఇన్సులిన్ ఆపేసి, చంపడానికి ప్రయత్నించారు. అది ఫలించక పోవడంతో ఇప్పుడు బీజేపీ గూండాలు అరవింద్ కేజ్రీవాల్‌పై దాడి చేశారు. కేజ్రీవాల్‌ను చంపేయాలని బీజేపీ భావిస్తోంది. అరవింద్ కేజ్రీవాల్‌కి ఏదైనా జరిగితే దానికి బీజేపీ బాధ్యత వహించాల్సి ఉంటుంది..” అని తెలిపారు. అయితే ఈ ఆరోపణలను బీజేపీ ఢిల్లీ శాఖ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవ తోసిపుచ్చారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com