Delhi Liquor Scam : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో పెద్ద ట్విస్ట్.. మనీష్ సిసోడియాకు ఆఫర్..

Delhi Liquor Scam : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో పెద్ద ట్విస్ట్.. మనీష్ సిసోడియాకు ఆఫర్..
Delhi Liquor Scam : మనీష్‌ సిసోడియా ఆమ్‌ ఆద్మీని వదిలి తమ పార్టీలో చేరితే సీబీఐ కేసులు ఎత్తివేస్తామన్న ఆడియో తమ దగ్గర ఉందని ఆమ్ఆద్మీ పార్టీ అంటోంది.

Delhi Liquor Scam : ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో ట్విస్ట్ ఇచ్చింది ఆమ్‌ ఆద్మీ పార్టీ మనీష్‌ సిసోడియా ఆమ్‌ ఆద్మీని వదిలి తమ పార్టీలో చేరితే సీబీఐ కేసులు ఎత్తివేస్తామన్న బీజేపీ ఆఫర్‌కు సంబంధించిన ఆడియో తమ దగ్గర ఉందని సంచలన ప్రకటన చేసింది. ప్రస్తుతం పరిస్థితుల్లో ఆ ఫోన్‌ సంభాషణలను విడుదల చేయబోమని...కానీ అవసరం వస్తే తప్పకుండా రిలీజ్ చేస్తామని తెలిపింది.

ఢిల్లీలో గతేడాది నవంబర్‌లో కేజ్రీవాల్‌ సర్కార్ తెచ్చిన న్యూ లిక్కర్‌ పాలసీలు అవకతవకలు జరిగాయని ఆరోపణలున్నాయి. మద్యం విధానంలో నిబంధనల ఉల్లంఘన జరగడంతో పాటు విధానపరమైన లోపాలున్నట్లు ఢిల్లీ సీఎస్‌ నివేదిక ఇచ్చారు. టెండర్ల విధానంలో కొందరికి లబ్ధి చేకూరేలా నిర్ణయాలు తీసుకున్నారని నివేదికలో వెల్లడించారు. దీంతో ఈ ఉల్లంఘనలపై దర్యాప్తు చేపట్టాలని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌ సక్సేనా...సీబీఐకి సిఫార్సు చేశారు. ఐతే ఈ ఆరోపణలను కొట్టిపారేశారు ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్‌ సిసోడియా. తనపై పెట్టినవన్ని తప్పుడు కేసులేనన్నారు. బీజేపీలో చేరితే కేసులన్ని ఎత్తివేస్తామని ఆ పార్టీ నేతలు ఆఫర్‌ ఇచ్చారని సంచలన ఆరోపణలు చేశారు.

Tags

Next Story