Delhi liquor policy case : ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ ఇంట్లో ఈడీ తనిఖీలు

Delhi liquor policy case : ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ ఇంట్లో ఈడీ తనిఖీలు
పలువురు ఎంపీ సన్నిహితుల ఇళ్లలో సోదాలు

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ నివాసంలో బుధవారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోదాలు నిర్వహించారు. అంతకుముందు ఈ కేసులో ఎంపీ సంజయ్ కు సన్నిహితంగా ఉన్న మరికొందరి ఇళ్లలో సోదాలు జరిగాయి. ED ఛార్జిషీట్ ప్రకారం ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ కేసులో నిందితుడిగా పేర్కొన్న ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త దినేష్ అరోరా ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ సమక్షంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను ఆయన నివాసంలో కలిశారు.


తాను ఒక కార్యక్రమంలో సంజయ్ సింగ్‌ను కలిశానని, ఆ తర్వాత ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాతో కూడా సంప్రదింపులు జరిపినట్లు అరోరా ఈడీకి తెలిపారు. అయితే ఇదంతా ఢిల్లీ ఎన్నికలకు ముందు నిధుల సేకరణ కోసం చేసినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఎంపీ సంజయ్ సింగ్ అభ్యర్థన మేర దినేష్ అరోరా ఢిల్లీలో పార్టీ నిధుల సేకరణ కోసం రెస్టారెంట్ల యజమానులు రూ. 32 లక్షల చెక్కులను సిసోడియాకు అప్పగించారని ఈడీ పేర్కొంది. లిక్కర్ డిపార్ట్‌మెంట్‌తో దినేష్ అరోరాకు ఉన్న దీర్ఘకాలిక సమస్యను ఎంపీ సంజయ్ సింగ్ పరిష్కరించారని ఈడీ ఆరోపించింది.



ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఎంపీ మాగుంట శ్రీనువాసులు కొడుకు మాగుంట రాఘవ అఫ్రూవర్‌గా మారిన సంగతి తెలిసిందే. కాగా, ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అఫ్రూవర్‌గా మారడానికి మాగుంట రాఘవ చేసుకున్న దరఖాస్తును తాజాగా రౌస్ అవెన్యూ కోర్టు అనుమతి ఇచ్చింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నమోదు చేసిన కేసులో మాగుంట రాఘవ అఫ్రూవర్‌గా మారారు. ఈ కేసులో జైలుకెళ్లిన మాగుంట రాఘవ ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నారు. రాఘవతో పాటు ఈ కేసులో మరో కీలక నిందితుడు దినేష్ ఆరోరా అఫ్రూవర్‌గా మారడాన్ని కూడా కోర్టు పర్మిషన్ ఇచ్చింది.

ఇంతకు ముందే ఈ కేసులో మాగుంట రాఘవ తండ్రి.. వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి అఫ్రూవర్ గా మారారు. ఇ ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఇప్పటికే 20 మంది నుండి కీలక సమాచారం సేకరించింది ఈడీ. హైద్రాబాద్ నుండి ఢిల్లీకి నగదు బదిలీపై ఈడీ అధికారులు ఫోకస్ పెట్టారు.

Tags

Read MoreRead Less
Next Story