Arvind Kejriwal: మాలివాల్‌పై దాడి కేసు మీద తొలిసారి స్పందించిన కేజ్రీవాల్

పార్టీ ఎంపీ స్వాతి మాలివాల్ మీద దాడి ఘటనపై ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ తొలిసారి స్పందించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరుగుతుందని ఆశిస్తున్నానని... న్యాయం జరగాలన్నారు. ఈ కేసులో రెండు కోణాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఇద్దరి నుంచి నిష్పక్షపాత విచారణ జరిగినప్పుడే సరైన న్యాయం అందుతుందని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఈ అంశం న్యాయస్థానం పరిధిలో ఉందని... కాబట్టి ఏమీ మాట్లాడలేనన్నారు.
కొన్ని రోజుల క్రితం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇంట్లోని డ్రాయింగ్ రూంలో వేచి ఉన్న స్వాతి మలివాల్‌తో.. ఆయన పీఏ బిభవ్ కుమార్ అమర్యాదగా ప్రవర్తించారని.. అంతేకాకుండా ఆమెపై దాడి చేసినట్లు తీవ్ర ఆరోపణలు వచ్చాయి. దీంతో ఈ వ్యవహారం ఆమ్ ఆద్మీ పార్టీలోనే తీవ్ర దుమారం రేపింది. దీంతో ఈ కేసులో బిభవ్ కుమార్‌ను అరెస్ట్ చేసిన ఢిల్లీ పోలీసులు అతడ్ని ముంబైకి తీసుకెళ్లారు. బిభవ్ కుమార్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, సీసీటీవీ రికార్డులను స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ పరీక్షలకు పంపించారు.కేజ్రీవాల్ ఇంట్లో స్వాతి మాలివాల్‌తో బిభవ్ కుమార్ అమర్యాదగా ప్రవర్తించి, దాడి చేసినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో బిభవ్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు నిందితుడిని ముంబైకి తీసుకువెళ్లారు. నిందితుడి నుంచి ఫోన్లు, ల్యాప్‌టాప్, సీసీటీవీ రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. వీటిని ఫోరెన్సిక్ పరీక్షలకు పంపించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com