Jharkhand: జార్ఖండ్‌లో ఘోర రైలు ప్రమాదం..

Jharkhand: జార్ఖండ్‌లో ఘోర రైలు ప్రమాదం..
X
మంటల్లో లోకో పైలెట్లు సహా ముగ్గురు మృతి

జార్ఖండ్‌లోని సాహిబ్‌గంజ్‌లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. రెండు గూడ్స్‌ రైళ్లు ఢీకొట్టుకున్నాయి. ఆ తర్వాత మంటలు చెలరేగి రెండు ఇంజిన్లకు మంటలు అంటుకున్నాయి. ఈ ప్రమాదంలో లోకో పైలెట్లు సహా ముగ్గురు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. ఈ ఘటనలో ముగ్గురు సీఐఎస్‌ఎఫ్‌ జవాన్లు సైతం గాయపడ్డట్లు తెలుస్తున్నది. ఈ ఘటన తెల్లవారు జామున 3.30 గంటలకు జరిగినట్లు తెలుస్తున్నది. ఫరక్కా నుంచి లాల్మాటియాకు వెళ్తున్న గూడ్స్‌ రైలు బర్హెట్‌లో ఆగి ఉన్న గూడ్స్‌ రైలును ఢీకొట్టినట్లు సమాచారం. ఆ తర్వాత అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో.. కష్టపడి మంటలను అదుపులోకి తీసుకువచ్చినట్లు సమాచారం. ఇందుకు సంబంధించి ఇంకా పూర్తి సమాచారం తెలియాల్సి ఉన్నది.

ఆదివారం ఒడిశాలో రైలు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. కామాఖ్య ఎక్స్‌ప్రెస్‌ రైలు బోగీలు పట్టాలు తప్పాయి. కటక్‌లోని నెర్గుండి రైల్వేస్టేషన్‌ సమీయంలో ప్రమాదం జరిగింది. బెంగళూరు నుంచి రైలు నంబర్ 12251 అసోంలోని కామాఖ్య స్టేషన్‌కు వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఒకరు మరణించగా.. ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ఒడిశాలోని కటక్ జిల్లాలో ఆదివారం ఒక ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పిందని ఓ అధికారి పేర్కొన్నారు. ఎస్‌ఎంవీటీ బెంగళూరు-కామాఖ్య ఏసీ ఎక్స్‌ప్రెస్‌కు చెందిన 11 కోచ్‌లు మంగూలి సమీపంలోని నెర్గుండిలో ఉదయం 11.54 గంటలకు పట్టాలు తప్పినట్లు తెలిపారు.

Tags

Next Story