Lawrence Bishnoi Gang: లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందిన ఏడుగురు అరెస్టు
లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌పై ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ ఫోకస్ పెట్టింది. బిష్ణోయ్ గ్యాంగ్ కు చెందిన మరో ఏడుగురు షూటర్లను అరెస్ట్ చేసింది. పంజాబ్ సహా పలు రాష్ట్రాల నుంచి వారిని అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. కాల్పులు జరిపిన వారి నుంచి ఆయుధాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులందరినీ బాబా సిద్ధిఖీ హత్య కేసు గురించి ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. బాబా సిద్ధిఖీ హత్య కేసును దర్యాప్తు చేస్తున్న ముంబై క్రైమ్ బ్రాంచ్ నిందితుడిని విచారించగా, కాల్పులు జరిపిన వ్యక్తికి లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు అన్మోల్ బిష్ణోయ్‌తో ప్రత్యక్ష సంబంధం ఉన్నట్లు తెలిసింది. హత్యకు ముందు నిందితులు అన్మోల్ బిష్ణోయ్‌తో ఫోన్లో మాట్లాడినట్లు సమాచారం. ఇకపోతే, సిద్ధిఖీ హత్య కేసులో ఇప్పటివరకు ముంబై క్రైమ్ బ్రాంచ్ 11 మందిని అరెస్టు చేసింది.
ఇదిలా ఉండగా.. బాబా సిద్ధిఖీ హత్య కేసును దర్యాప్తు చేస్తున్న ముంబై క్రైమ్ బ్రాంచ్ నిందితుడిని విచారించగా, కాల్పులు జరిపిన వ్యక్తి లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు అన్మోల్ బిష్ణోయ్‌తో ప్రత్యక్ష సంబంధం ఉన్నట్లు తెలిసింది. హత్యకు ముందు నిందితులు అన్మోల్ బిష్ణోయ్‌తో ఫోన్లో మాట్లాడినట్లు సమాచారం. ఈ కేసుకు సంబంధించి వరకు ముంబై క్రైమ్ బ్రాంచ్ 11 మందిని అరెస్టు చేసింది.లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు అన్‌మోల్ బిష్ణోయ్ ఆచూకీ చెప్పినవారికి రూ.10 లక్షలు బహుమతి ఇవ్వనున్నట్లు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) ప్రకటించింది. ముంబైలోని బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ నివాసం వద్ద ఏప్రిల్‌లో కాల్పుల సంఘటనలో అన్‌మోల్ ప్రమేయం ఉన్నట్లు ఆరోపించింది.
నెక్స్ట్ టార్గెట్ ఎవరు?
సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు, ఎసీపీ నాయకుడు బాబా సిద్ధిఖీ హత్య తర్వాత లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ టార్గెట్ ఎవరు? అనే ప్రశ్న మొదలైంది. అయితే తాజాగా పట్టుబడిన లారెన్స్ బిష్ణోయ్ కి చెందిన షూటర్లు విచారణలో ఒక రాజకీయ పార్టీ నాయకుడి మేనల్లుడిని చంపాలని ప్లాన్ చేసినట్లు చెబుతున్నారు. లారెన్స్ బిష్ణోయ్‌పై కాల్పులు జరిపిన ఏడుగురు ముష్కరులను అరెస్ట్ చేసిన తర్వాత స్పెషల్ సెల్ ఈ విషయాన్ని వెల్లడించింది. ఆ రాజకీయ నాయుకుడు ఎవరు? ఆయన అల్లుడిని ఎందుకు చంపాలనుకుంటున్నారనే దానిపై ప్రశ్నలు వస్తున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com