Kidnap: సత్కరిస్తామని ఆహ్వానించి.. నటుడు కిడ్నాప్..

బాలీవుడు నటుడు ముస్తాక్ ఖాన్ ను గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసి.. అతని వద్ద నుంచి రెండు లక్షలు కాజేశారు. వివరాల్లోకి వెళ్తే.. వెల్కమ్, స్త్రీ2 చిత్రాల్లో నటించిన ముస్తాక్ ఖాన్‌కు మంచి గుర్తింపు ఉన్నది. అయితే మీరట్‌లో నిర్వహించే ఈవెంట్‌కు హాజరుకావాలంటూ ముస్తాక్ ఖాన్‌కు ఆహ్వానం అందింది. ఢిల్లీ వరకు ఫ్లయిట్ ఛార్జీలు చెల్లిస్తామని చెప్పారు. దీనిలో భాగంగా అతని అకౌంట్లో కొంత పేమెంట్ చేశారు. నవంబర్ 20వ తేదీన మీరట్‌లో జరిగే అవార్డు ఫంక్షన్‌కు ఆహ్వానిస్తున్నామని చెప్పి .. నటుడు ముస్తాక్‌ను ఢిల్లీకి రప్పించారు.
ఢిల్లీలో ముస్తాక్ ఖాన్ విమానం దిగిన తర్వాత సీన్ మారింది. ఓ వాహనంలో నటుడిని తీసుకుని కొంత దూరం వెళ్లారు. అక్కడ మరో వాహనంలోకి ఎక్కించారు. ఆ తర్వాత 12 గంటల పాటు కిడ్నాపర్లు అతన్ని బంధించారు. కోటి ఇవ్వాలంటూ కిడ్నాపర్లు చిత్రహింస పెట్టారు. కానీ ఖాన్, అతని కుమారుడి అకౌంట్ల నుంచి కేవలం రెండు లక్షలు మాత్రమే ట్రాన్స్‌ఫర్ చేసినట్లు తెలుస్తోంది.
కిడ్నాపర్ల వద్ద ఉన్న సమయంలో.. మసీదు అజా విన్న అతను అక్కడికి పారిపోయాడు. ఆ తర్వాత స్థానికులకు తన పరిస్థితి చెప్పి సాయం కోరాడు. పోలీసుల సహాయంతో అతను స్వంత ఇంటికి వెళ్లాడు. ప్రస్తుతం ముస్తాక్ ఖాన్ క్షేమంగా ఉన్నారు. ఆ ఘటన పట్ల త్వరలో ఆయన మీడియాకు వివరించనున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com