Sayaji Shinde: ఆరోగ్యంగానే ఉన్నా, త్వరలోనే మీ ముందుకు వస్తా

Sayaji Shinde: ఆరోగ్యంగానే ఉన్నా,  త్వరలోనే మీ ముందుకు వస్తా
అభిమానుల కోసం సాయాజీ షిండే వీడియో

అనారోగ్యం కారణంగా ఇటీవల ఆసుపత్రిలో చేరిన ప్రముఖ నటుడు సాయాజీ షిండే కోలుకుంటున్నారు. తాను ఆరోగ్యంగానే ఉన్నానని, ఆందోళన చెందాల్సిన పనిలేదంటూ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులకు తెలిపారు. ప్రస్తుతం తాను కోలుకుంటున్నట్లు చెబుతూ ఓ వీడియోను రిలీజ్ చేశారు. నన్ను ప్రేమించే అభఇమానులందరూ నా శ్రేయోభిలాషులందరూ నాతో ఉన్నారు. ఇప్పుడు చింతించాల్సిన పనిలేదు. త్వరలోనే మిమ్మల్ని అలరించేందుకు మీ ముందుకు వస్తాను. ధన్యవాదాలు”అంటూ ఆసుపత్రి బెడ్ పై నుంచి ఓ వీడియోను షేర్ చేశారు. త్వరలోనే వచ్చి అభిమానులను అలరిస్తానని పేర్కొన్నారు. ఆయన పోస్టుపై స్పందిస్తున్న అభిమానులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రస్తుతం షిండే పరిస్థితి నిలకడగా ఉందని.. మరో రెండు రోజుల్లో డిశ్చార్జ్ కానున్నట్లు సమాచారం.

సాయాజీ షిండే తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ, మరాఠీ, భోజ్ పురి, హిందీ భాషల్లో అనేక చిత్రాల్లో విలన్ పాత్రలతో గుర్తింపు పొందారు. తెలుగులో గుడుంబా శంకర్, ఆంధ్రుడు, అతడు, పోకిరి, లక్ష్మి, ఆట దుబాయ్ శీను, ఆర్య 2, అరుంధతి, మిస్టర్ పర్ఫెక్ట్, దూకుడు, బిజినెస్ మెన్ వంటి అనేక చిత్రాల్లో నటించి మెప్పించారు.

చాతీనొప్పితో బాధపడుతూ ఈ నెల 11న సాయాజీ షిండే మహారాష్ట్రలోని సతారాలో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు గుండెలో కుడివైపున 99 శాతం బ్లాక్స్ గుర్తించి వెంటనే యాంజియోప్లాస్టీ చేశారు. జేడీ చక్రవర్తి నటించిన ‘సూరి’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన సాయాజీ షిండే అతడు, పోకిరి సహా పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించి తెలుగువారికి దగ్గరయ్యారు.

Tags

Read MoreRead Less
Next Story