Actor Vijay : పొత్తుల్లేవ్.. సొంతంగా గెలువబోతున్నాం : టీవీకే చీఫ్ విజయ్

తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. ఇప్పటికే అన్ని పార్టీలు ఎన్నికల మూడ్ లోకి వెళ్లిపోయాయి. తమిళనాడులో సాధారణంగా డీఎంకే, అన్నాడీఎంకే పార్టీల మధ్య ప్రధాన పోరు ఉంటుంది. కానీ, ఇప్పుడు రాబోతున్న ఎన్నికలు మరింత రసవత్తరంగా మారాయి. ప్రముఖ సినీ నటుడు విజయ్ తొలిసారి ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టడమే దీనికి కారణం. తమిళగ వెట్ర కళగం (టీవీకే) పార్టీని స్థాపించిన విజయ్... అధికార డీఎంకేను కూల్చడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. తాజాగా ఆయన మాట్లాడుతూ... పొత్తులకు సంబంధించి ఫుల్ క్లారిటీ ఇచ్చారు.
రానున్న ఎన్నికల్లో రెండు ప్రధాన జాతీయ కూటములతో (ఎన్డీయే, యూపీఏ) పొత్తు పెట్టుకోబోమని, స్వతంత్రంగానే ఎన్నికల్లో పోటీ చేస్తామని విజయ్ ప్రకటించారు. తమ పార్టీ రాష్ట్రంలో ప్రధాన రాజకీయ శక్తిగా అవతరిస్తుందని, సంప్రదాయ పార్టీలైన రెండు వ్యతిరేక పక్షాలకు ప్రత్యామ్నాయంగా ఆవిర్భవిస్తుందని ఆయన చెప్పారు. ఎన్నికల తర్వాత కూడా తమ పార్టీ ఏ కూటమిలో చేరబోదని స్పష్టం చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
