కొత్త చిక్కుల్లో పడ్డ నటీమణులు సంజన , రాగిణి ద్వివేది

కొత్త చిక్కుల్లో పడ్డ నటీమణులు సంజన , రాగిణి ద్వివేది
శాండల్‌ వుడ్‌ డ్రగ్స్ రాకెట్‍ కేసులో అరెస్ట్ అయిన హీరోయిన్లు సంజన గాల్రానీ, రాగిణి ద్వివేది ఇప్పుడు కొత్త చిక్కుల్లో పడ్డారు. విచారణలో తవ్వేకొద్దీ కొత్త నిజాలు వెలుగు చూస్తున్నాయి..

శాండల్‌ వుడ్‌ డ్రగ్స్ రాకెట్‍ కేసులో అరెస్ట్ అయిన హీరోయిన్లు సంజన గాల్రానీ, రాగిణి ద్వివేది ఇప్పుడు కొత్త చిక్కుల్లో పడ్డారు. విచారణలో తవ్వేకొద్దీ కొత్త నిజాలు వెలుగు చూస్తున్నాయి. వీరిద్దరి ఫోన్లలో డేటా రిట్రీవ్‍ చేయగా డిలీట్‍ చేసిన ఒక వాట్సాప్‍ గ్రూప్‍ బయట పడింది. ఆ గ్రూప్‍లో అనేక మంది హీరోయిన్లు, యువతుల నగ్న చిత్రాలు, పోర్న్‌ వీడియోలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వీరు డ్రగ్స్ రాకెట్‍తో పాటు సెక్స్ రాకెట్‍ కూడా నడిపే వారని పోలీసులు కనుగొన్నారు.

అలాగే ఆ వీడియోలు, ఫోటోల్లో ఉన్నదెవరో కూడా విచారణ జరుపుతున్నారు. సాధారణ డ్రగ్స్ రాకెట్‍ కేసుగా మొదలైన సంజన, రాగిణి వ్యవహారం ఇప్పుడు పెద్ద మలుపు తీసుకుంది. సెక్స్ రాకెట్‍, వీడియోల సంగతి బయట పడడంతో కన్నడ చిత్ర సీమలో కలకలం రేగుతోంది. ఈ వ్యవహారంలో పలువురు హీరోలు, హీరోయిన్లు కూడా బయటకు వచ్చే అవకాశాలున్నాయనే ప్రచారం మొదలైంది. ఈ విచారణ జరిగితే ఇంకెన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తాయో అన్న అనుమానాలు కలుగుతున్నాయి.

ప్రస్తుతం పరప్పన అగ్రహార సెంట్రల్‌ జైల్లో ఉన్నారు సంజన, రాగిణి. ఈ కేసులో ఇద్దరూ బెయిల్ కోసం అప్లై చేసుకోగా.. కోర్టు తిరస్కరించింది. వీరిద్దరి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతుండటంతో కన్నడ పరిశ్రమలో కలకలం రేపుతోంది.

Tags

Next Story