FEMA Case : ఈడీ దర్యాప్తునకు హాజరైన టీనా అంబానీ

ఫారెక్స్ ఉల్లంఘన కేసు లో నిన్న అనిల్, నేడు టీనా

ఫెమా నిబంధనలు ఉల్లంఘించారనే ఆరోపణలతో ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ భార్య, సీనియర్ నటి టీనా అంబానీని ఈడీ ప్రశ్నించారు. విదేశీ మారక చట్టంలోని పలు సెక్షన్ల కింద నమోదైన కేసులో నిన్న అనిల్ అంబానీ వాంగ్మూలం ఇచ్చారు. నేడు టీనా ఈడీ ఎదుట హాజరయ్యారు.

నిన్న ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీని ప్రశ్నించిన ఈ డీ ఈరోజు అతని భార్యను ప్రశ్నించారు. ఇవాళ ముంబయిలోని ఈడీ కార్యాలయంలో ఆమె విచారణకు హాజరయ్యారు. ముంబయి బల్లార్డ్ ఎస్టేట్ ఏరియాలోని ఈడీ కార్యాలయంలో టీనా అంబానీ స్టేట్‌మెంట్‌ను అధికారులు రికార్డు చేసుకున్నారు. యెస్ బ్యాంక్ ప్రమోటర్ రాణా కపూర్ కేసులో మనీ లాండరింగ్ ఆరోపణలపై 2020లో అనిల్ అంబానీ ఈడీ ముందు హాజరయ్యారు. కానీ అప్పుడు టీనా హాజరు కావాలని ఈడీ కోరలేదు.

అనిల్‌ అంబానీకి చెందిన 9 కంపెనీలు యస్‌ బ్యాంక్‌ నుంచి రూ.12,800 కోట్లు రుణాలు పొందాయి. అయితే సకాలంలో రుణాలు చెల్లించకపోవడంతో ఇవన్నీ నిరర్థక ఆస్తుల జాబితాలోకి చేరాయి. ఈ కేసులో ఇప్పటికే యెస్ బ్యాంక్స్ సహ వ్యవస్థాపకుడు రాణా కపూర్‌, తదితరులను అరెస్ట్ చేశారు. యస్ బ్యాంక్ నుంచి రిలయన్స్‌తోపాటు, పాటు చాలా కంపెనీలు బ్యాంక్ నుంచి తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించడంలో విఫలం కావడంతో మొండి బకాయిలుగా మారిపోయాయి. ఈ కేసులో విచారణలో భాగంగా ఈడీ గతంలో అంబానీకి సమన్లు జారీ చేసి విచారించింది.

రెండు స్విస్ బ్యాంకు ఖాతాల్లో రూ. 814 కోట్లకు పైగా వెల్లడించని నిధులపై రూ.420 కోట్ల పన్నులు ఎగవేసిన ఆరోపణలపై 2022 ఆగస్టులో ఐటీ శాఖ.. అనిల్‌ అంబానీకి నోటీసు జారీ చేసింది. ఈ ఏడాది మార్చిలో ఐటీ శాఖ షోకాజ్‌ నోటీసులు, పెనాల్టీ డిమాండ్‌పై అనిల్ అంబానీపై ఎలాంటి బలవంతపు చర్య తీసుకోవద్దని బాంబే హైకోర్టు ఆదేశించడం ఆయనకు కొంత ఉపశమనం ఇచ్చింది .




భారతదేశంలో అత్యంత సంపన్నుడైన ముఖేష్ అంబానీ తమ్ముడు అనిల్ అంబానీ సంపాదన భారీగా పడిపోయినట్లు నివేదికలు చెబుతున్నాయి. అనిల్ అంబానీ యునైటెడ్ కింగ్‌డమ్‌లోని కోర్టులో తన ప్రస్తుత నికర విలువ రూ.0 అని వెల్లడించారు. నిజానికి ఆయన ఆస్తుల విలువ 13.7 బిలియన్ డాలర్లు అని నివేదికల ద్వారా తెలుస్తోంది. భారతీయ కరెన్సీ ప్రకారం ఇది దాదాపు రూ. 1.12 లక్షల కోట్లకంటే ఎక్కువ. అనిల్ అంబానీ తన ఆస్తులు సున్నా రూపాయలు అని కోర్టులో చెప్పినప్పటికీ.. ముంబైలో 17 అంతస్థుల భవంతి, రూ. 20 కోట్ల విలువైన కార్లు, అత్యంత ఖరీదైన బోట్స్, ప్రైవేట్ జెట్స్ మొదలైనవన్నీ ఉన్నాయి. నికర ఆస్తుల విలువ భారీగా తగ్గినప్పటికీ, ప్రస్తుత ఆస్తులు రూ. 83 మిలియన్ల కంటే ఎక్కువ అని తెలుస్తోంది. ఆసియాలో ఆరవ ధనవంతుగా ఎదిగిన అనిల్ అంబానీని కంపెనీ నిధులను స్వాహా చేసిన ఆరోపణలకు గానూ సెబీ మార్కెట్ నుంచి నిషేదించింది.

Tags

Read MoreRead Less
Next Story