ISRO: భారత్ నెక్స్ట్ టార్గెట్ శుక్రుడు, అంగారకుడు..

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘చంద్రయాన్-3’ మిషన్ పూర్తిగా విజయవంతం అయ్యింది. దీని తర్వాత సూర్యునిపై అధ్యయనం కోసం చేపట్టిన సోలార్ మిషన్ ‘ఆదిత్య ఎల్-1’ సక్సెస్‌ఫుల్‌గా నింగిలోకి దూసుకుళ్లింది. లాగ్రాంజ్ పాయింట్ దిశగా దూసుకుపోతున్న ఈ మిషన్.. మార్గమధ్యంలో నుంచి తన పనిని మొదలుపెట్టేసింది. గగన్‌యాన్ ప్రాజెక్ట్ కూడా వచ్చే ఏడాది ప్రయోగించనుంది. వచ్చే ఏడాది గగన్‌యాన్ ప్రాజెక్ట్‌ను లాంచ్ చేసేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు సిద్ధం అయ్యారు. ఇందులో భాగంగానే ఇటీవల నిర్వహించిన టెస్ట్ ఫ్లైట్ కూడా విజయవంతం అయింది. ఈ క్రమంలోనే ఇక తదుపరి ప్రయోగాలైన శుక్రుడు, అంగారకుడిపై ఇస్రో శాస్త్రవేత్తలు దృష్టి సారించింది. ఈ నేపథ్యంలోనే భవిష్యత్ ప్రయోగాలపైనా దృష్టి సారించింది. శుక్రుడు, అంగారక గ్రహాలపైకి చేపట్టే ప్రయోగాల గురించి తాజాగా ఒక ఇస్రో శాస్త్రవేత్త సమాచారం అందించారు.
ఐదేళ్లలో అంగారకుడు, శుక్రడు గ్రహాలపై భారత్ ఉనికిని గుర్తించాలని ఇస్రో భావిస్తోందని బెంగళూరులోని యుఆర్ రావు శాటిలైట్ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ ఎం శంకరన్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ మిషన్ కాన్సెప్ట్‌లపై అంతర్గత చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. అయితే.. ప్రతీ మిషన్‌లోనూ కొన్ని సవాళ్లు ఉంటాయని అన్నారు. అంగారకుడి వాతావరణంలోకి ప్రవేశించినప్పుడు వ్యోమనౌక వేడెక్కడం, ల్యాండ్ అయ్యేందుకు సరైన ప్రదేశాన్ని కనుగొనడం వంటి సవాళ్లు ఉంటాయన్నారు.
అంగారకుడి వాతావరణంలోకి ప్రవేశించినప్పుడు వ్యోమనౌక వేడెక్కడం, ల్యాండ్ అయ్యేందుకు సరైన ప్రదేశాన్ని కనుగొనడం వంటి వాటిని క్షుణ్ణంగా అధ్యయనం చేయాలని వెల్లడించారు. ఇక అంగారకుడు, శుక్రుడు లేదా ఇతర ప్రయోగాలకు అవసరమైన భారీ పేలోడ్‌లను మోసుకెళ్లే ప్రయోగ వాహనాలను అభివృద్ధి చేయడం కూడా అంత సులభం కాదని తెలిపారు.
ప్రస్తుతమున్న LVM3 (లాంచ్ వెహికల్ మార్క్-3, ఇస్రో అభివృద్ధి చేసిన ప్రయోగ వాహనం) కెపాసిటీకి, ల్యాండింగ్ రిక్వైర్‌మెంట్స్‌కి కొంత గ్యాప్ ఉందని.. దీనిపై తాము అధ్యయనం చేస్తున్నామని శంకరన్ చెప్పారు. దీనికితోడు మరో సవాల్ కూడా ఉందన్నారు. అంగారకుడి గ్రహంలోని వేడిని తట్టుకోవడం కోసం ఒక రక్షణ కవచం అవసరం ఉంటుందని, దీంతో ద్రవ్యరాశి పెరుగుతుందని అన్నారు. ఈ విషయంపై తాము పరిశీలనలు జరుపుతున్నామని పేర్కొన్నారు. LVM3 మెరుగు పరిచే పనులు సాగుతున్నాయని.. వచ్చే రెండేళ్లలో 20-30 శాతం ఎక్కువ పేలోడ్ సామర్థ్యాన్ని ఇస్రో అంచనా వేస్తోందని ఆయన వివరించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com