Brij Bhushan : ఇప్పుడు అక్రమ మైనింగ్ కూడా..

బీజేపీ ఎంపీ, భారత రెజ్లర్ల సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ మరోసారి న్యాయపరమైన చిక్కులను ఎదుర్కొంటున్నారు. మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధించిన కేసు ఇంకా ఏది తేలకుండానే ఇసుక,అక్రమ మైనింగ్ బాగోతంపై బ్రిజ్ భూషణ్ పై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) విచారణకు ఆదేశించింది. గోండాలోని తన కంపెనీ అక్రమ ఇసుక తవ్వకాలు, ఖనిజాల రవాణా కారణంగా సరయూ నదికి నష్టం వాటిల్లిందనే ఆరోపణలపై విచారణకు పూనుకుంది.
జస్టిస్ అరుణ్ కుమార్ త్యాగి మరియు డాక్టర్ ఎ సెంథిల్ వేల్‌లతో కూడిన ఢిల్లీలోని ఎన్‌జిటి ప్రిన్సిపల్ బెంచ్ ఆగస్టు 2న తన ఆదేశాలను జారీ చేసింది. పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ , సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా, ఉత్తరప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలితో కూడిన సంయుక్త కమిటీని ఏర్పాటు చేసింది. వారం రోజుల్లోగా సమావేశం కావాల్సిందిగా కమిటీని ఆదేశించింది.
కేసర్ గంజ్ పార్లమెంటు సభ్యుడైన బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ జైత్‌పూర్, నవాబ్‌గంజ్, మఝరత్, తహసీల్ తర్బ్‌గంజ్, జిల్లా గోండా గ్రామాల్లో అక్రమ మైనింగ్, ఓవర్‌లోడ్ ట్రక్కుల ద్వారా వెలికితీసిన ఖనిజాలను అక్రమ రవాణా చేశారనే ఆరోపణలు వచ్చాయి. దీనివల్ల సరయు నదికి నష్టం సంభవించిందని, ఈ ట్రాక్కుల వల్ల పట్ పర్ గుంజ్ వంతెనకు నష్టం వాటిల్లిందని కూడా ఎన్జీటీ పేర్కొంది.
బ్రిడ్జ్ భూషణ్ గతంలో హత్యాయత్నం, అల్లర్లు, ల్యాండ్ మాఫియాతో సంబంధాలు, ఇతర తీవ్రమైన ఆరోపణలతో సహా 38 క్రిమినల్ కేసులను ఎదుర్కొన్నారు. అయితే 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు ఆయన నిర్దోషిగా విడుదలయ్యారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com