Agneepath Notification:అగ్నిపథ్‌పై వెనక్కి తగ్గని కేంద్రం.. నోటిఫికేషన్ విడుదల..

Agneepath Notification: అగ్నిపథ్‌పై దేశం అట్టుడుకుతున్నా కేంద్రం వెనక్కి తగ్గట్లేదు. తాజాగా అగ్నివీర్ రిక్రూట్‌మెంట్‌కు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇక రేపు నేవీ.. 24న ఎయిర్‌ఫోర్స్ అగ్నివీర్ నోటిఫికేషన్ రిలీజ్ కానుంది. జులై నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభం అవుతాయని అధికారులు తెలిపారు. ఇక అగ్నివీర్ టెక్నికల్‌కు విద్యార్హత 10వ తరగతిగా నిర్ణయించారు.
అగ్నివీర్ ట్రేడ్స్‌మెన్‌కు 8వ తరగతిగా క్వాలిఫికేషన్ డిసైడ్ చేశారు. అభ్యర్థుల వయసు పదిహేడున్నరేళ్ల నుంచి 23ఏళ్ల లోపుండాలని నిర్ణయించారు. అగ్నివీర్లు నాలుగేళ్లపాటు సర్వీసులో కొనసాగుతారు. తర్వాత వీరిలో 25శాతం మందిని రెగ్యూలర్ ఉద్యోగాల్లోకి తీసుకుని మిగతా వారిని ఇంటికి పంపుతారు. మరోవైపు అగ్నిపథ్‌పై ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. అభ్యర్థుల నుంచి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com