AGNI: భారత రక్షణ శక్తికి మరో అస్త్రం అగ్ని ప్రైమ్

AGNI: భారత రక్షణ శక్తికి మరో అస్త్రం అగ్ని ప్రైమ్
X
భారత రక్షణ రంగంలో కొత్త పుట

భారత రక్షణ రంగంలో కొత్త పుట రాసిన చారిత్రక క్షణానికి దేశం సాక్ష్యమైంది. తొలిసారి రైలుపై నుంచి అణుసామర్థ్యం కలిగిన అగ్ని-ప్రైమ్‌ (Agni-P) బాలిస్టిక్‌ క్షిపణిని ప్రయోగించడం ద్వారా భారత్‌ తన వ్యూహాత్మక శక్తిలో విశేషమైన ముందడుగు వేసింది. రక్షణ పరిశోధనాభివృద్ధి సంస్థ (DRDO) ఆధ్వర్యంలో విజయవంతంగా నిర్వహించిన ఈ పరీక్షను రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ స్వయంగా ప్రకటిస్తూ దేశానికి గర్వకారణమయ్యారు.

ఇప్పటి వరకు బాలిస్టిక్‌ మిసైళ్లను సాధారణంగా భూస్థాయి మొబైల్‌ లాంచర్లు లేదా నావికాదళ నౌకల నుంచి మాత్రమే ప్రయోగించారు. కానీ రైలుపై నుంచి ప్రయోగించే టెక్నాలజీ అత్యంత కీలకమైనది మొబిలిటీ (చలనం): దేశంలోని విస్తృత రైల్వే నెట్‌వర్క్‌ను వినియోగించుకుని క్షిపణులను తక్కువ సమయంలో అవసరమైన ప్రదేశానికి తరలించవచ్చు. సర్ప్రైజ్‌ ఎలిమెంట్: శత్రువుకు ముందస్తు సమాచారం అందకుండా, గుప్తంగా ప్రయోగించే అవకాశం ఉంటుంది.

రియాక్షన్ టైమ్‌ తగ్గింపు: ముందస్తు ఏర్పాట్లు లేకుండానే తక్షణం క్షిపణి లాంచ్‌ చేసే సామర్థ్యం లభిస్తుంది. ఈ విధానం ద్వారా భారత్‌ "సెకండ్‌ స్ట్రైక్‌ కెపాసిటీ"ను మరింత బలపరచగలదు. అంటే శత్రువు మొదట దాడి చేసినా, భారత్‌ తక్షణ ప్రతిదాడి చేయగల సామర్థ్యాన్ని ఈ సాంకేతికత పెంచుతుంది.

అగ్ని-ప్రైమ్‌ మిసైల్‌ శక్తి

అగ్ని-ప్రైమ్‌ అనేది ఇప్పటికే పరీక్షల్లో తన ప్రతిభను నిరూపించుకున్న అగ్ని సిరీస్‌ క్షిపణులలో ఆధునికత కలిగినది. రేంజ్‌: 1,000–2,000 కిలోమీటర్ల వరకు శత్రు ప్రాంతాలను సునాయాసంగా చేరగలదు. ప్రొపల్షన్‌: రెండవ తరం ఘన ఇంధన టెక్నాలజీతో మరింత శక్తివంతమైంది. నేవిగేషన్‌: రింగ్‌ లేజర్‌ గైరో, మైక్రో ఇనర్షల్‌ నేవిగేషన్‌ సిస్టమ్‌ అమర్చడం వల్ల ఖచ్చితమైన లక్ష్యాన్ని తాకుతుంది. జీపీఎస్‌, నావిక్‌ శాటిలైట్‌ నేవిగేషన్‌ సపోర్ట్‌తో దీని విశ్వసనీయత మరింత పెరిగింది. కెనిస్టర్‌ డిజైన్‌: ఈ మిసైల్‌ను ఎక్కడికైనా సులభంగా రవాణా చేయొచ్చు. భద్రతా పరంగా కూడా ఇది అత్యుత్తమం.

Tags

Next Story