తెలంగాణకు రానున్న ఎన్నికల సంఘం ప్రతినిధి బృందం

ఈ ఏడాది చివరిలోగా జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నిర్వహణ అంచనాల కోసం కేంద్ర ఎన్నికల కమిషన్ రాష్ట్రంలో పర్యటించనుంది.
సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ ధర్మేంద్ర శర్మ, డిప్యూటీ ఎన్నికల కమిషనర్ల నేతృత్వంలోని ప్రతినిధి బృందం జూన్ 22 నుంచి 24 వరకు మూడు రోజుల పాటు హైదరాబాద్‌లో సమీక్షలు, సమావేశలు నిర్వహించనుంది. రాష్ట్ర ఎన్నికల సన్నద్ధతపై చర్చించి అంచనా వేయడానికి సీఈవో వికాస్ రాజ్ బుధవారం డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అంజనీ కుమార్‌తో సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
తెలంగాణలో శాసనసభకు జరగనున్న సాధారణ ఎన్నికల గురించి జిల్లా కలెక్టర్లు, పోలీసు సూపరింటెండెంట్ల సంసిద్ధతను అంచనా వేయడానికి ఒక సమావేశం నిర్వహించి కేంద్ర ఎన్నికల కమిషన్ బృంద పర్యటనను ప్రకటించారు. రాష్ట్రనికి రానున్న ఈసీఐ ప్రతినిధి బృందం ముందుగా సీఈవో, స్పెషల్ పోలీస్ నోడల్ ఆఫీసర్, సీఏపీఎఫ్ నోడల్ ఆఫీసర్‌తో కీలకమైన సమావేశాలలో పాల్గొంటుందని, ఈ సమయంలో ఎన్నికల భద్రతకు సంబంధించిన అంశాలు, వ్యూహాలను గురించి చర్చించనున్నారని తెలిపారు.
అనంతరం జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, ఆదాయపు పన్ను, ఎన్సీబీ, ఎక్సైజ్ శాఖ, జీఎస్టీ డిపార్ట్‌మెంట్, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, స్టేట్ లెవల్ బ్యాంకర్స్ కమిటీతో సహా వివిధ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలతో విస్తృతమైన సంప్రదింపులు జరపనున్నట్టుగా సమాచారం. ఎన్నికల సమగ్రతను కాపాడేందుకు రాష్ట్ర, జిల్లా స్థాయిలలో సమన్వయాన్ని పెంపొందించడం ఈ సమావేశాల లక్ష్యం అని తెలుస్తోంది. ఎన్నికల నిర్వహణ ప్రక్రియలో రాష్ట్ర జిల్లా స్థాయిలలో సమన్వయము సంబంధిత అంశాలతో ఈ సమావేశాల్లో చర్చిస్తారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com