MP Elections: మధ్యప్రదేశ్‌లో ఎన్నికల్లో రాముడి చుట్టూ రాజకీయం

MP Elections: మధ్యప్రదేశ్‌లో ఎన్నికల్లో రాముడి చుట్టూ రాజకీయం
X
అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్‌ నేతల మధ్య మాటల యుద్ధం

మధ్యప్రదేశ్‌ ఎన్నికల ప్రచారంలో అయోధ్య రామమందిర నిర్మాణం కాక పుట్టిస్తోంది. భాజపా నేతలు తమ ఫ్లెక్సీలు, హోర్డింగులపై రామాలయం ఫొటోలు ముద్రించటంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్న కాంగ్రెస్‌ ఈ విషయంపై ఈసీకి ఫిర్యాదు చేసింది. అధికార పార్టీ నేతలు ప్రచారంలో మతపరమైన చిహ్నాలు వాడుతున్నారని ఆరోపించింది. అయితే పలువురు నేతలు ఈ విషయాన్ని కూడా ప్రచారాస్త్రంగా చేసుకోవటంతో కాంగ్రెస్‌ వ్యూహం మార్చింది. . రామ మందిరం దేశ ప్రజలందరికీ చెందుతుంని, అది భాజపాకే సొంతం కాదంటూ హస్తం నేతలు ప్రచారం మొదలుపెటారు .

మధ్యప్రదేశ్‌ శానససభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్‌ మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. అయోధ్యలో రామమందిర నిర్మాణం అంశం రెండు పార్టీల మధ్య రాజకీయ రగడకు దారితీస్తోంది. అయోధ్య అంశాన్ని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు కమలం పార్టీ....ఫ్లెక్సీలు, హోర్డింగ్స్‌లో రామమందిరం ఫొటోను ముద్రించటంపై హస్తం పార్టీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఆలయ నిర్మాణం తుదిదశకు చేరుకోవటం.... కాంగ్రెస్‌కు కష్టంగా మారిందంటూ ఆ పార్టీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాజపా మతపరమైన చిహ్నాలను వాడుతోందని ఇటీవల కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. అధికార పార్టీ ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తోందని పేర్కొంది.

భాజపా ఏర్పాటు చేస్తున్న కటౌట్లు, హోర్డింగ్స్‌పై అయోధ్య రామమందిరం, ఉజ్జయిని మహాకాల్‌ ఆలయాల చిత్రాలను ముద్రించటాన్నికాంగ్రెస్‌ పార్టీ ఈసీ దృష్టికి తీసుకెళ్లింది. ఈ అంశాన్ని కూడా భాజపా నేతలు తమకు అనుకూలంగా మార్చుకోవటంపై కాంగ్రెస్‌ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. కాంగ్రెస్‌ పార్టీ ఈసీకి ఫిర్యాదు చేసిన పత్రాలను భాజపా శ్రేణులు సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తూ ప్రతిపక్ష పార్టీ రామాలయానికి వ్యతిరేకమంటూ ప్రచారం చేస్తున్నారు. హిందుత్వాన్ని, సనాతన ధర్మాన్ని వ్యతిరేకించడమే కాంగ్రెస్‌ నైజమని కమలం నేతలు విమర్శిస్తున్నారు. తమ పార్టీ ఫ్లెక్సీలు, హోర్డింగులపై వేసిన రాముడి చిత్రాలను తొలగించాలని కాంగ్రెస్‌ ఫిర్యాదు చేయటంపై కమలనాథులు మండిపడుతున్నారు. రామ మందిరం రాష్ట్రంలోని 9.5కోట్లమంది ప్రజల విశ్వాసమని, రాముడిపై విశ్వాసముంటే కాంగ్రెస్‌ కూడా తమ ఫ్లెక్సీలు, హోర్డింగ్స్‌ల్లో రామమందిరం ఫొటోలు ముద్రించుకోవచ్చని భాజపా నేతలు చురకలు వేస్తున్నారు. మొత్తంగా చూస్తే అయోధ్య రామాలయ నిర్మాణ అంశం భాజపా, కాంగ్రెస్‌ ప్రచారంలో కీలకంగా మారే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి

Tags

Next Story