Bharat Jodo Yatra: తొలి వార్షికోత్సవానికి ఘనంగా ఏర్పాట్లు

Bharat Jodo Yatra:  తొలి వార్షికోత్సవానికి ఘనంగా ఏర్పాట్లు
గురువారం దేశవ్యాప్తంగా 722 ప్రాంతాల్లో భారత్ జోడో యాత్ర..

భారత్ జోడో యాత్రను ప్రారంభించి సెప్టెంబర్ 7 నాటికి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా దేశవ్యాప్తంగా తొలి వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు కాంగ్రెస్ సిద్ధమవుతోంది. అందులో భాగంగా దేశంలోని 722 జిల్లాల్లో పాదయాత్రలు చేపట్టనున్నట్లు ఆ పార్టీ ప్రకటించింది. భారత్ జోడో యాత్ర దేశవ్యాప్తంగా తమ కేడర్ ను బలోపేతం చేసేందుకు తోడ్పడిందని A.I.C.C ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ చెప్పారు. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 7 దేశవ్యాప్తంగా తమ పార్టీ రాష్ట్రాల చీఫ్ లు, MLAలు, MP లు ఇతర ముఖ్య నేతలు ,కార్యకర్తలు సాయంత్రం 5 నుంచి 6 మధ్య భారత్ జోడో యాత్ర చేస్తారని చెప్పారు.


కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ గతేడాది భారత్ జోడో యాత్ర నిర్వహించిన విషయం తెలిసిందే. గతేడాది సెప్టెంబర్ 7న కన్యాకుమారి నుంచి భారత్ జోడో యాత్రను రాహుల్ గాంధీ ప్రారంభించారు. యాత్రలో భాగంగా 136 రోజుల పాటు 4,081 కిలో మీటర్ల మేర రాహుల్ పాదయాత్ర చేశారు. ఈ భారత్ జోడో యాత్ర 12 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లో పరిధిలోని 75 జిల్లాల్లో 76 లోక్‌సభ నియోజకవర్గాల్లో సాగింది. అంతేకాక, భారత్ జోడో యాత్రలో 100 పైగా గ్రూప్ ఇంటరాక్షన్స్, 250పైగా వాకింగ్ ఇంటరాక్షన్స్ ,100 కార్నర్ మీటింగ్స్, 13 భారీ ర్యాలీలు, 12 మీడియా సమావేశాలు రాహుల్ గాంధీ నిర్వహించారు.


దేశంలో ధరల పెరుగుదల, నిరుద్యోగం, విభజన రాజకీయాలు, ప్రజాస్వామ్య పరిరక్షణ, చైనా దురాక్రమణలకు వ్యతిరేకంగా రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేపట్టారు. యాత్ర చేపట్టి గురువారంతో సంవత్సరం కావడంతో తొలి వార్షికోత్సవాన్ని నిర్వహించేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. దేశవ్యాప్తంగా గురువారం భారత్ జోడో యాత్ర తొలి వార్షికోత్సవాన్ని కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా నిర్వహించనున్నారు.

గురువారం దేశవ్యాప్తంగా 722 ప్రాంతాల్లో భారత్ జోడో యాత్రలను ప్రతి జిల్లాలో నిర్వహించాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించింది. దేశవ్యాప్తంగా సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు పాదయాత్రల నిర్వహణ ఉంటుంది. ఈ భారత్ జోడో పాదయాత్రలో సీడబ్ల్యుసీ సభ్యులు, పీసీసీలు, సీఎల్పీలు ఇన్చార్జిలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, మాజీ మంత్రులు, సీనియర్ నేతలు పాల్గొంటారు. యాత్ర తరువాత భారత్ జోడో సమావేశాలను కాంగ్రెస్ నేతలు నిర్వహించనున్నారు.

Tags

Read MoreRead Less
Next Story