Waqf Board: కోల్‌కతా ఈడెన్ గార్డెన్ స్టేడియం వక్ఫ్ బోర్డుదే..

Waqf Board: కోల్‌కతా ఈడెన్ గార్డెన్ స్టేడియం వక్ఫ్ బోర్డుదే..
X
ఎంఐఎం నేత క్లెయిమ్..

దేశవ్యాప్తంగా వక్ఫ్ బిల్లు సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. వక్ఫ్ బోర్డు అపరిమిత అధికారాలను తొలగిస్తూ, సవరణలతో కొత్త బిల్లును కేంద్రం తీసుకువచ్చింది. దీనిపై ప్రతిపక్షాల అభ్యంతరం కారణంగా, జాయింట్ పార్లమెంటరీ కమిటీ నియమించింది. ఈ కమిటీ తన రిపోర్టుని పార్లమెంట్‌కి సమర్పించింది. ఈ బడ్జెట్ సమావేశాల్లో వక్ఫ్ బిల్లు సభ ముందుకు వచ్చే అవకాశం కనిపిస్తోంది.

పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలోని ప్రముఖ క్రికెట్ స్టేడియం అయిన ఈడెన్ గార్డెన్స్ మైదానం కూడా వక్ఫ్ బోర్డుకు సంబంధించిన ఆస్తి అని ఇమ్రాన్ సోలంకి పేర్కొనడం ఇప్పుడు తీవ్ర దుమారానికి కారణం అవుతోంది. అదే సమయంలో భారత సైన్యానికి చెందిన తూర్పు కమాండ్ ప్రధాన కార్యాలయంగా ఉన్న ఫోర్ట్ విలియ కూడా వక్ఫ్ ఆస్తేనని తేల్చి చెప్పారు. కోల్‌కతాలోని పార్క్ స్ట్రీట్‌లో వక్ఫ్‌ బోర్డుకు 105 ఆస్తులు ఉన్నట్లు ఇమ్రాన్ సోలంకి పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ఇమ్రాన్ సోలంకి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర వివాదాస్పదంగా మారాయి.

ఈ స్టేడియం కోసం రాష్ట్ర ప్రభుత్వమే అద్దె చెల్లిస్తోందని అన్నారు. బెంగాల్‌లో అత్యధిక వక్ఫ్ భూమి ఉందని సోలంకి పేర్కొన్నారు. ఈ రాష్ట్రంలోనే వక్ఫ్ ఆస్తుల ఆక్రమణ గరిష్టంగా ఉందని చెప్పారు. 8000 చోట్ల వక్ఫ్ భూమి ఆక్రమణకు గురైందని, వీటిలో ఈడెన్ గార్డెన్ భూమి కూడా ఉందని చెప్పారు. లోని వక్ఫ్ బోర్డుకు పశ్చిమ బెంగాల్‌లోనే అత్యధికంగా భూమి ఉందని సోలంకి పేర్కొన్నారు. అయితే బెంగాల్‌లోనే వక్ఫ్ ఆస్తుల ఆక్రమణ అత్యధికంగా ఉందని చెప్పారు. 8 వేల చోట్ల వక్ఫ్ బోర్డు భూమి ఆక్రమణకు గురైందని.. ఇందులో ఈడెన్ గార్డెన్స్ స్టేడియం కూడా ఉందని ఇమ్రాన్ సోలంకి వెల్లడించారు.

Tags

Next Story