MIM Leader Shot Dead: బీహార్‌లో ఎంఐఎం నేత కాల్చివేత

MIM Leader Shot Dead:  బీహార్‌లో ఎంఐఎం నేత కాల్చివేత
గోపాల్‌గంజ్‌లో గత రాత్రి సలామ్‌పై కాల్పులు

బీహార్‌లోని ఎంఐఎం పార్టీ నేత అబ్దుల్ స‌లామ్ అలియాస్ అస్ల‌మ్ ముఖియాను కాల్చివేశారు. ఈ ఘ‌ట‌న బీహార్‌లోని గోపాల్‌గంజ్‌లో జ‌రిగింది. అబ్దుల్ స‌లామ్ ఆ రాష్ట్ర ఎంఐఎం కార్య‌ద‌ర్శిగా ఉన్నారు. గోపాల్‌గంజ్ జిల్లా అధ్య‌క్షుడు కూడా. అయితే బైక్ మీద వ‌చ్చిన కొంద‌రు దుండ‌గ‌లు కాల్పులు జ‌రిపిన‌ట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ ఘ‌ట‌న ప‌ట్ల సిట్‌ను ఏర్పాటు చేశారు.

నిందితుల్ని అరెస్టు చేసేందుకు రెయిడ్స్ చేస్తున్న‌ట్లు తెలిపారు. తూటాల‌కు బ‌లైన వ్య‌క్తిని ఎంఐఎం నేత‌గా గుర్తించామ‌ని, ఈ కేసులో ద‌ర్యాప్తు ముమ్మ‌రం చేశామ‌ని ఎస్డీపీవో ప్రంజ‌ల్ కుమార్ తెలిపారు. విషయం తెలిసిన పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ముఖియా కుటుంబానికి మనోధైర్యం ప్రసాదించాలని ప్రార్థిస్తున్నట్టు పేర్కొన్నారు.

గత నెలలో సివాన్ జిల్లా అధ్యక్షుడు అరీఫ్ జమాల్‌ను కూడా కాల్చి చంపారని అసద్ గుర్తు చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌పై నిప్పులు చెరిగారు. ‘‘కుర్చీ కోసం జరిగిన పోటీలో మీరు మీ కుర్చీని కాపాడుకున్నారుగా, ఇప్పటికైనా కొంత పనిచేయండి. మా నాయకులను మాత్రమే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు. వారి కుటుంబాలకు న్యాయం జరుగుతుందా?" అని ఒవైసీ ప్రశ్నించారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దుండగుల కోసం గాలిస్తున్నారు. వీలైనంత త్వరగా నిందితులను పట్టుకుంటామని తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story