Air Hostess Assault: వెంటిలేటర్‌పై ఉన్న ఎయిర్ హోస్టెస్‌పై లైంగిక దాడి

గురుగ్రామ్‌లోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో దారుణం జరిగింది. వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న ఎయిర్ హోస్టెస్(46)పై ఆసుపత్రి సిబ్బంది ఒకరు అఘాయిత్యానికి పాల్పడ్డారు. పోలీసుల కథనం ప్రకారం.. బాధిత ఎయిర్ హోస్టెస్ గురుగ్రామ్‌లోని ఓ హోటల్‌లో బస చేశారు. ఈ నెల 5న అక్కడ ఉన్న ఈత కొలనులో స్విమ్మింగ్ చేస్తుండగా కింద పడటంతో అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమెను సమీపంలోని ప్రముఖ ఆసుపత్రిలో చేర్పించారు.
మరుసటి రోజున అక్కడ వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న ఎయిర్ హోస్టెస్‌పై ఆసుపత్రి సిబ్బంది ఒకరు అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే, ఈ విషయాన్ని ఆమె బయటపెట్టలేదు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాక విషయాన్ని ఆమె భర్తకు చెప్పింది. అనంతరం ఇద్దరూ కలిసి స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కోర్టులో న్యాయమూర్తి ఎదుట పోలీసులు ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడి కోసం సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. నిందితుడిని త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com