Air India Plane Crash : ఎయిర్ ఇండియా విమాన ప్రమాద ప్రాథమిక నివేదికలో కీలక విషయాలు!

అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాద ఘటనపై ప్రాథమిక నివేదిక వెల్లడైంది. ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగెంట్ బ్యూరో 15 పేజీలతో ప్రాథమిక నివేదికను సమర్పించింది. ఫ్లైట్ టేకప్ అయిన కొన్ని సెకన్లలోనే ఫ్యూయల్ స్విచ్‌లు ఆగిపోవడం వల్లే ప్రమాదం జరిగి ఉంటుందని ప్రాథమికంగా నిర్ధరణకు వచ్చింది. ప్రమాదానికి ముందు ఫ్యూయల్ పరిమితిలోనే ఉందని ఏఏఐబీ పేర్కొంది. విమానయాన మార్గంలో పక్షికి సంబంధించి ఎలాంటి కదలికలు నమోదు కాలేదని స్పష్టం చేసింది. విమానంలో ఎటువంటి ప్రమాదకరమైన వస్తువులు లేవని, కుట్రం కోణం ఉందని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవని ఏఏఐబీ వెల్లడించింది.
జూన్ 12న ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంకు గురైంది. ప్రమాదంలో 241 మంది ప్యాసింజర్లు మృతి చెందారు. ఫ్లైట్ టేకప్ అయిన కొన్ని సెకన్లలోనే ఫ్యూయల్ స్విచ్‌లు ఆగిపోయాయని ఏఏఐబీ తన నివేదికలో తెలిపింది. రెండు ఇంజన్ల బటన్స్ రన్ టూ కట్ ఆఫ్‌కు మారాయని, దాంతో ప్లైట్ రెండు ఇంజన్లు ఆగిపోయాయని స్పష్టం చేసింది. విమానం కూలడానికి ముందు పైలట్ల సంభాషణ వివాదాస్పదంగా మారింది. స్విచ్ ఆఫ్ ఎందుకు చేసావు అని మరో పైలెట్‌ను ప్రశ్నించగా.. తాను స్విచ్ ఆఫ్ చేయలేదని సమాధానం ఇచ్చాడు. ఆ తర్వాత పైలెట్స్ మేడే కాల్ ఇచ్చారు. కాక్ పిట్‌లో పైలెట్ల చివరి సంభాషణ రికార్డ్ అయింది.
ప్రమాదానికి ముందు ఫ్యూయల్ పరిమితిలోనే ఉందని ఏఏఐబీ పేర్కొంది. ‘రెండు ఇంజన్ల ఇంధన స్విచ్ ‘కటాఫ్’ నుంచి మళ్లీ ‘రన్’కు మారింది. ఫ్లైట్లో ఎటువంటి ప్రమాదకరమైన వస్తువులు లేవు. అహ్మదాబాద్ ఎయిర్‌పోర్ట్ ప్రహరీ దాటక ముందే విమానం ఆగిపోయింది. విమాన ప్రమాదంపై దర్యాప్తు కొనసాగుతోంది. విమానంలోని కీలక భాగాలను క్వారంటైన్ చేశాం’ అని ఏఏఐబీ తెలిపింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com