Air India Plane Crash: అహ్మదాబాద్ ఘటనకు రెండు ఇంజిన్ల వైఫల్యమే కారణమా..?

అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో 270 మంది మరణించారు. అయితే, ఈ ప్రమాదానికి కారణాలపై దర్యాప్తు బృందాలు విచారణ చేపట్టాయి. అయితే, విమానం గాలిలో ఉండగానే రెండు ఇంజన్లు ఫెయిల్ అయ్యాయా.?? అని పరిశోధకులు, విమానయాన సంస్థలు అధ్యయనం చేస్తున్నాయి. విమానం కూలిపోయే సమయంలో ల్యాండింగ్ గేర్ బయటకు ఉండటం, రెక్కల్లోని ప్లాప్స్ ఉపసంహరించుకుని ఉండటం ప్రమాద విజువల్స్‌లో కనిపించాయి. అయితే, ఇదే పరిస్థితులను ఫ్లైట్ సిమ్యులేటషన్‌లో ప్రదర్శించారు. అయితే, ఈ రకంగా ఉన్న సెట్టింగ్స్ మాత్రమే ప్రమాదానికి కారణం కాదని దర్యాప్తు గురించి తెలిసిన కొంత మంది చెప్పారు. బహుశా రెండు ఇంజన్ల వైఫల్యం ప్రమాదానికి కారణం కావచ్చని అనుమానిస్తున్నారు.
ఎమర్జెన్సీ పవర్ టర్బైన్ కూడా ఢీకొనడానికి కొన్ని సెకన్ల ముందు బయటకు వచ్చిందని తేలింది. దీనిని బట్టి చూస్తే సాంకేతిక వైఫల్యం కూడా ఒక సాధ్యమయ్యే కారణంగా ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో AAIB నేతృత్వంలోని అధికారిక దర్యాప్తు నుండి విడిగా సిమ్యులేట్ ఫ్లైట్ నిర్వహించబడింది, ప్రమాదానికి సాధ్యమయ్యే సీన్లను క్రియేట్ చేస్తున్నారు. జూన్ 12 కూలిపోయిన విమానం బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్‌లో జనరల్ ఎలక్ట్రిక్ కంపెనీకి చెందిన రెండు ఇంజన్లతో నడిచింది. అయితే, టేకాఫ్ అయ్యే సమయంలో మాత్రం కావాల్సిన శక్తి అందుకోలేన్లు అనిపించింది.
అయితే, బోయింగ్ ఇప్పటి వరకు దీనిపై వ్యాఖ్యానించేందుకు నిరాకరించింది. దర్యాప్తుపై ఇప్పుడేం వ్యాఖ్యానించలేమని జనరల్ ఎలక్ట్రిక్ కూడా చెప్పింది. రెండు ఇంజన్లు ఒకేసారి శక్తిని కోల్పోయో లేదో తెలియదు.అయితే, పరిశోధకులు రెండు ఫ్లైట్ రికార్డర్ల నుంచి మరింత సమాచారం వస్తుందని చూస్తున్నారు. ప్రమాద సమయంలో, విమానం ల్యాండింగ్ గేర్ కొద్దిగా ముందుకు వంగి ఉంది, ఇది ల్యాండింగ్ గేర్‌ని వాపస్ తీసుకునే స్థితిలో ఉన్నట్లు సూచిస్తోంది. అదే సమయంలో ల్యాండింగ్ గేర్ తలుపులు తెరుచుకోలేదని తెలుస్తోంది. దీనిని బట్టి చూస్తే విమానంలో ఎలక్ట్రిసిటీ లేదా హైడ్రాలిక్ ఫెయిల్యూర్ జరిగినట్లు నిపుణులు చెబుతున్నారు.
విద్యుత్ వైఫల్యం సంభవించినప్పుడు విమానం నుంచి RAT అని పిలువబడే అత్యవసర టర్బైన్, విమానం కూలిపోయే ముందు ఇది యాక్టివేట్ అయింది. ఇది అత్యవసర వ్యవస్థలకు విద్యుత్ అందిస్తుంది. దీనిని బట్టి చూస్తే ఎలక్ట్రిక్ వైఫల్యం కలిగి ఉండొచ్చని, ఇంజన్లు పనిచేయకుండా ఉండొచ్చని సందేహిస్తున్నారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com