Bomb Threat: ఎయిర్ ఇండియా విమానంకు బాంబు బెదిరింపు
విమానాలకు బాంబు బెదిరింపులు కొనసాగుతూనే ఉన్నాయి. ఆరు రోజుల్లో 20కిపైగా విమానాలకు బెదిరింపులు రావడం కలకలం సృష్టిస్తున్నది. రెండు రోజుల క్రితం ఫ్రాంక్‌ఫర్ట్ నుంచి ముంబైకి వస్తున్న విస్తారా విమానానికి బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా అదే సంస్థకు చెందిన విమానానికే మరోసారి బెదిరింపులు వచ్చాయి. ఢిల్లీ నుంచి లండన్‌కు వెళ్తున్న విస్తారా యూకే 17 విమానానికి సోషల్ మీడియాలో సెక్యూరిటీ థ్రెట్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన అధికారులు సమాచారాన్ని విమాన సిబ్బందికి చేరవేశారు. ఈ నేపథ్యంలో పైలట్లు విమానాన్ని ఫ్రాంక్‌ఫర్ట్ విమానాశ్రాయనికి మళ్లించారు. అక్కడ భద్రతా పరమైన తనిఖీలు నిర్వహిస్తున్నారు. సెక్యూరిటీ ఏజెన్సీల నుంచి క్లియరెన్స్ వచ్చిన తర్వాత విమానం మళ్లీ గమ్యస్థానికి పయణమవుతుందని విస్తారా ఎయిర్‌లైన్స్ ప్రకటించింది. ప్రస్తుతం ప్రయాణికులంతా క్షేమంగా ఉన్నారని వెల్లడించింది.
ఈ నెల 17న 147 మంది ప్రయాణికులతో ఫ్రాంక్‌ఫర్ట్ నుంచి ముంబైకి వస్తున్న విస్తారా విమానానికి బెదిరింపులు వచ్చాయి. సోషల్ మీడియా బెదిరింపులు వచ్చిన తర్వాత సంబంధిత అధికారులకు సమాచారం ఇచ్చినట్లు విస్తారా ప్రతినిధి తెలిపారు. దీంతో విమానాన్ని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవవసరంగా ల్యాండ్ చేశారు. విమానాన్ని ఐసోలేషన్ బేకు తరలించి తనిఖీలు నిర్వహించారు.
ఇక రెండు రోజుల క్రితం ముంబై నుంచి లండన్‌కు బయల్దేరిన ఎయిర్ ఇండియా విమానానికి కూడా బెదిరింపులు వచ్చాయి. ఎయిర్ ఇండియా బోగింగ్ 777 విమానం ముంబై నుంచి గురువారం ఉదయం 7.05 గంటలకు టేకాఫ్ అయ్యింది. తూర్పు ఇంగ్లండ్ వైపు వెళ్తున్న సమయంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. విమానం AI129 లండన్‌లోని హీత్రూ విమానాశ్రయంలో మధ్యాహ్నం 12:05 గంటలకు (యూకే కాలమానం ప్రకారం) దిగాల్సి ఉంది. ల్యాండింగ్‌కు గంట ముందుగానే ఎమర్జెన్సీని ప్రకటించారు. అనంతరం విమానం హీత్రూ విమానాశ్రయంలో సేఫ్‌గా ల్యాండ్ అవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com