Air India Flight: ముంబై-న్యూయార్క్ విమానానికి బాంబు బెదిరింపులు

రోజు (సోమవారం) ముంబై నుంచి న్యూయార్క్ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు రావడంతో ఢిల్లీకి మళ్లించారు. విమానం ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ అయింది. విమానంలోని ప్రయాణికులు, సిబ్బంది అందరూ సురక్షితంగా ఉన్నారు. అయితే, తదుపరి తనిఖీలు జరుగుతున్నాయని అధికారులు తెలిపారు. ఇక, ప్రయాణికులు, సిబ్బంది భద్రతను నిర్ధారించడానికి అన్ని ప్రామాణిక భద్రతా ప్రోటోకాల్‌లను అనుసరిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
న్యూయార్క్‌లోని జేఎఫ్ కే విమానాశ్రయానికి AI 119 అనే విమానం ముంబై నుంచి తెల్లవారుజామున 2 గంటలకు బయలుదేరింది. ఆ తర్వాత బాంబు బెదిరింపు రావడంతో వెంటనే ఫైలెట్స్ విమానాన్ని ఢిల్లీకి మళ్లించారు. విమానం ప్రస్తుతం న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఉంది. సెక్యూరిటీ సిబ్బంది విమానాన్ని తనిఖీ చేస్తున్నారు. అయితే, ఈ ఘటనకు సంబంధించి ఎయిర్ ఇండియా అధికారులు ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.
కాగా, గత నెలలో ముంబైకి చెందిన మరో ఎయిర్ ఇండియా విమానానికి కూడా బాంబు బెదిరింపు రావడంతో దాన్ని తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ చేశారు. విమానం వాష్‌రూమ్‌లో టిష్యూ పేపర్‌పై వ్రాసిన “బాంబ్ ఇన్ ఫ్లైట్” సందేశంలో కనుగొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com