Air India: అమెరికాకు వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం.. రష్యాకు

Air India: అమెరికాకు వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం.. రష్యాకు
X
సాంకేతిక కారణాలతో క్రాస్నోయార్స్క్ ఎయిర్ పోర్టులో ల్యాండ్..

న్యూఢిల్లీ నుంచి శాన్‌ఫ్రాన్‌సిస్కో బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో దారి మళ్లించాల్సి వచ్చింది. అత్యవసరంగా విమానాన్ని రష్యాలోని క్రాన్సోయార్క్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దింపేశారు. ఈ మేరకు ఎయిర్ ఇండియా సోషల్ మీడియాలో ప్రకటించింది. ప్రయాణికులు సిబ్బంది భద్రత దృష్ట్యా ముందుజాగ్రత్త చర్యగా విమానాన్ని రష్యాకు దారి మళ్లించాల్సి వచ్చిందని పేర్కొంది. ప్రయాణికులకు ఇబ్బంది రాకుండా, తదుపరి ఏయే చర్యలు తీసుకోవాలనే దానిపై స్థానిక అధికారుల సాయం తీసుకుంటున్నట్టు తెలిపింది. విమానం క్షేమంగా లాండయ్యిందని, ప్రయాణికుల భద్రతకే తమ మొదటి ప్రాధాన్యతని పేర్కొంది.

బోయింగ్ 777 విమానంలో 225 మంది ప్రయాణికులు ఉన్నారు. ఇది కాకుండా 19 మంది విమాన సిబ్బంది కూడా ఉన్నట్లు ఎయిర్ ఇండియా ప్రకటించింది. ప్రయాణికులు, సిబ్బంది యొక్క భద్రత, శ్రేయస్సు మా మొదటి ప్రాధాన్యత అని ఎయిర్ ఇండియా చెప్పుకొచ్చింది. ఏడాది వ్యవధిలో ఇదే మార్గంలో ఎయిర్ ఇండియా విమానం ఈ విధంగా రష్యాలో ల్యాండ్ కావడం ఇది రెండోసారి. గతేడాది జూన్‌లో ఎయిరిండియాకు చెందిన బోయింగ్ విమానం కూడా సాంకేతిక సమస్యలతో ఒక రోజు నిలిచిపోయింది. దీంతో విమాన ప్రయాణికులను మగదాన్‌ ఎయిర్‌పోర్టులో దింపేసిన తర్వాత రోజు ప్రయాణికులను ఎక్కించుకోవడానికి అమెరికాకు ఎయిర్ ఇండియా విమానం వెళ్లిపోయింది.

Tags

Next Story